పడక గదికి ఎవరూ రమ్మనలేదు.. కానీ... | Kajal on casting couch allegaions.

Kajal responded on casting couh

Kajal Agarwal, Kajal Casting Couch, Kajal Agarwal Comments Tollywood, Tollywood Sexual Harassment, Kajal Agarwal Compromise, Tollywood Sexaul Harassment, Star Heroine on Cast Couching

Kajal Agarwal shocking statement. She have never faced casting couch but forces exposing for songs in initial stage.

కాస్టింగ్ కౌచ్ పై కాజల్ స్పందన

Posted: 03/20/2017 11:30 AM IST
Kajal responded on casting couh

కాస్టింగ్ కౌచ్ ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతున్న ఓ హాట్ టాపిక్. సినిమాలో ఒక్క ఛాన్స్ కోసం ఖచ్ఛితంగా కాంప్రమైజ్ అయి తీరాల్సిందేనని పలువురు సీనియర్ హీరోయిన్లు ఓపెన్ గా చెప్పటం తీవ్ర దుమారం రేపింది. అంతేకాదు ప్రస్తుతం ఉన్న హీరోయిన్లంతా ఆ బాపతే అన్న చందాన మాట్లాడిన వాళ్లు.. అందుకే ఒకే చెప్పకపోవటంతోనే తమను తొక్కేసి పరభాష హీరోయిన్లను దిగుమతి చేసుకుంటున్నారని వారు వ్యాఖ్యలు చేశారు.

అయితే దీనిపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ లాంటి కొందరు మరోరకంగా మాట్లాడటం చూశాం. అవకాశాలు లేకపోవటం మూలంగానే వాళ్లు అలా మాట్లాడి హైలెట్ అవుతున్నారంటూ చెప్పటం తెలిసిందే. ఏదీ ఏమైనా ఒక్కోక్కరుగా దీనిపై కామెంట్లు చేస్తూ బాంబులు పేలుస్తున్నారు. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ వంతు వచ్చింది. కాంప్రమైజ్ గురించి తనకు ఎలాంటి ప్రపోజల్ రాలేదన్న కాజల్ అగర్వాల్ కెరీర్ మొదట్లో మాత్రం దాదాపు అలాంటి పరిస్థితులే ఎదుర్కున్నానని చెప్పుకొచ్చింది.

టాలెంట్ ఉండి కూడా కొంతమంది ఆ విషయంలో ఎలా రాజీ పడ్డారో స్వయంగా కొందరు నాకు చెప్పారు. అది చాలా బాధాకరం. అయినా సినిమాల్లో రాణించటానికే తాము ఆ నిర్ణయం తీసుకున్నామని తనతో చెప్పేవారని వివరించింది. తనకు అలాంటి పరిస్థితి ఏనాడూ ఎదురు కాలేదని చెప్పిన కాజల్ అందుకు భగవంతుడికి కృతజ్నతలు చెబుతానంటోందీ. ఇక పాటల్లో ఎక్స్ పోజింగ్ గురించి ప్రస్తావిస్తూ తనకు అలాంటి ఎక్స్ పీరియన్స్ ఎదురైంది. అయితే త్వరగానే అందులోంచి బయటపడి, ఇకపై ఆ దారిలో వెళ్లకూడదని ఫిక్సయ్యిందంట. ప్రస్తుతం మాత్రం తనకు నచ్చిందే చేస్తున్నానన్న కాజల్, ఎవరి కోసమో కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదని మిగతా వాళ్లకి సలహా ఇస్తోంది చందమామ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Kajal Agarwal  Casting Couch  Tollywood Sexaul Harassment  

Other Articles