పాటలు పాడొద్దంటూ రాజా లీగల్ నోటీసులు.. ఎస్పీబీ ఏమన్నాడో తెలుసా? | SPB reaction on Ilayaraja legal notices.

Ilayaraja serves legal notice to legendary singer

Ilayaraja, SP Balasubramanyam, Ilayaraja Legal Notice, Balasubramanyam Ilayaraja Hits, SPB Ilayaraja Differences, SP Balasubramanyam Legal Notice, SPB 50, SP Balu Son, Legendary Composer Versus Singer, SP Balu Reaction

Veteran Composer Ilayaraja sends notice to SP Balasubramanyam for singing his songs. Shocked by the notice, SPB said on Sunday that he would not render the songs in future.

ఇళయరాజా నోటీసులపై బాలు రియాక్షన్

Posted: 03/20/2017 08:16 AM IST
Ilayaraja serves legal notice to legendary singer

క్లాసిక్ సంగీత దర్శకుడు ఇళయారాజా గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు లీగల్ నోటీసులు పంపిచటం దిగ్భ్రాంతికి గురిచేసింది. బాలు తనయుడు ఎస్పీ చరణ్ ఏర్పాటు చేసిన వరల్డ్ టూర్ లో భాగంగా పలు దేశాల్లో కచేరీలు ఇస్తున్న ఆయనకు ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా తయారయ్యింది. షోలలో ఆయన ఎక్కువగా ఇళయరాజా పాటలు పాడుతున్నారని, ఇంకెప్పుడూ ఆ పాటలు పాడ కూడదంటూ ఆయనకు నోటీసులు వచ్చాయి.

దీనిపై ఎస్పీబీ సోషల్ మీడియాలో స్పందించాడు. గత ఆగస్టు నుంచి ‘ఎస్పీబీ 50’ పేరిట తన కుమారుడు చరణ్ ఈ టూర్ కార్యక్రమం ప్రారంభించాడని చెప్పారు. ఇందులో భాగంగా తాము భారత్ తో పాటు టొరంటో, రష్యా, శ్రీలంక, మలేసియా, సింగపూర్, దుబాయ్ ల్లో చాలా ప్రదర్శనలు ఇచ్చామని, అప్పటి వరకు తమకు ఎలాంటి అభ్యంతరాలు రాలేదని ఆయన చెప్పాడు.

అయితే ఉన్నపళంగా అమెరికాలో కచేరీ నిర్వహిస్తుంటే ఈ నోటీసుల గొడవ మొదలైందని, అయినా చట్టాన్ని తాను గౌరవిస్తానని అన్నాడు. ఇకపై ఇళయరాజా పాటలు పాడనన్న ఆయన, కచేరీలు మాత్రం జరగాల్సిందేనని అన్నారు. మీడియాకు తాను విన్నవించుకునేది ఒకటేనని, దయచేసి, ఈ విషయాన్ని పెద్దది చేసి, తప్పుడు ప్రచారాలు చేయవద్దని.. బాలు ఆ పోస్టులో విజ్నప్తి చేశాడు. 1970 నుంచి దాదాపు 40 ఏళ్లుగా వీళిద్దరి కాంబినేషన్ లో లెక్కలేనని హిట్టు పాటలు వచ్చిన విషయం తెలిసిందే. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ilayaraja  SP Balasubramanyam  Legal Notices  

Other Articles