రవితేజ చేయలేంది సూర్య చేస్తున్నాడే! | Suriya with bollywood remake.

Suriya next bollywood remake

Actor Suriya, Suriya Vignesh Shivan, Suriya Special 26, Suriya Ravi Teja, Ravi Teja Next Movie, Ravi Teja Special 26, Suriya Bollywood Remake, Thaanaa Serndha Kootam Movie, Suriya Thaanaa Serndha Kootam, Suriya Keerthy Suresh Movie, Suriya Akshay Kumar, Suriya Ravi Teja

Suriya's next under Vignesh Shivan direction it’s not a proper remake but an adaptation of the Bollywood heist drama Special 26, taking only the core plot and making a lot of changes to the characterizations. Suriya is essaying the role of a CBI officer and Keerthi Suresh his love interest. Ramya Krishna has a crucial role, an important one to essay.

సూర్య నెక్స్ట్ట్ బాలీవుడ్ రీమేకే...

Posted: 03/18/2017 05:15 PM IST
Suriya next bollywood remake

సింగం-3 తర్వాత ఎలాంటి ప్రాజెక్టు కమిట్ కానీ సూర్య పా రంజిత్ లేదా రాయుడు ఫేమ్ ముత్తయ్యతో ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే ఆ రెండింటిని పక్కన పడేసిన సూర్య యంగ్ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రోసీడ్ అవుతున్నాడు. తానా సెంద్ర కూటమ్ పేరుతో రూపొందించబోతున్న చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ లెటెస్ట్ అప్ డేట్ బయటికి వచ్చింది.

బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన స్పెషల్ చబ్భీస్ సినిమానే రీమేక్ చేస్తున్నాడని ముందు చెప్పుకున్నారు. అయితే యథాతథంగా కాకుండా తమిళ నేటివిటీకి మార్పులు చేసి తీయబోతున్నారంట. ఇందులో సూర్య సీబీఐ ఆఫీసర్ గా నటించబోతుండగా, హీరోయిన్ గా కీర్తి సురేష్ జోడీ కడుతోంది. సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలకపాత్ర చేస్తోంది.

2013లో నీరజ్ పాండే డైరక్షన్ లో వచ్చిన స్పెషల్ 26 కమర్షియల్ గా హిట్ కాకపోయినా, క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది. ఫేక్ ఐటీ రైడ్స్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ చిత్రంలో అక్కీ సరసన కాజల్ నటించింది. ఈ సినిమాను మాస్ రాజా రవితేజతో రీమేక్ చేద్దామని యత్నించినప్పటికీ అది వీలు కాలేదు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Suriya  Vignesh Shivan  Special 26 Remake  

Other Articles

Today on Telugu Wishesh