బాహుబలి-2 ట్రైలర్ మహాద్భుతం.. అమేజింగ్ యాక్షన్.. రిచ్ విజువల్స్ | Baahubali The Conclusion Trailer Review.

Baahubali 2 official trailer released

Baahubali 2, Baahubali The Conclusion, Baahubali 2 Official Trailer, Baahubali 2 Tamil Trailer, Baahubali 2 Telugu Trailer, Baahubali 2 Hindi Trailer, Baahubali 2 Trailer Review, Baahubali The Conclusion Trailer Review

Baahubali The Conclusion Trailer Out. Amazing action sequences and Rich Visuals.

బాహుబలి-2 అఫీషియల్ ట్రైలర్ విడుదల

Posted: 03/16/2017 09:19 AM IST
Baahubali 2 official trailer released

యావత్ ఇండియన్ సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బాహుబలి ది కంక్లూజన్ ట్రైలర్ వచ్చేసింది. తమిళ్ వర్షన్ ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల థియేటర్ల ఉదయం 9 గంటలకు భారీ ఎత్తున విడుదలైంది. ఐమాక్స్ లో రాజమౌళి ట్రైలర్ ను ఆవిష్కరించాడు. తమిళంతోపాటు హిందీలో రిలీజ్ అయిన టీజర్ ట్విట్టర్ లో హల్ చల్ చేస్తుండగా, 1 నిమిషం 52 సెకన్ల నిడివి ఉన్న మైండ్‌ బ్లోయింగ్‌ వీఎఫ్‌ఎక్స్‌తో ట్రైలర్‌ రూపుదిద్దుకుంది.

మంటల్లో రాజకిరీటం, దానిపై ఎవరిదో చెయ్యి రక్తాభిషేకం చేయటం, జనాలు ఆసక్తిగా చూడటం, ఆపై రమ్యకృష్ణ కాలిని ఎవరో తాకుతున్నట్లు, కట్టప్ప రక్తపు కత్తి లాంటి ఎమోషనల్ సీన్లతో మొదలైన ట్రైలర్ ఆపై ఫస్ట్ వర్షన్ సీన్లను చూపించి, దేవసేన, బాహుబలి ప్రేమాయణంను చూపించారు. చివరకు కట్టప్ప, అమరేంద్రుడిని చంపటం లాంటి సీన్లను చూపించి అసలు యాక్షన్ ట్రీట్ ను అందించారు. 2 నిమిషాల 24 సెకన్ల తెలుగు ట్రైలర్ కూడా యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.

 

తండ్రి కోసం ప్రతీకారం తీర్చుకునే శివుడు మాహిష్మతిపైనే దండెత్తటం, భల్లాలుడితో ఢీ కొట్టే సన్నివేశాలు, అవిటి వాడైన బిజ్జాలదేవుడు గొడను బద్ధలు కొట్టడం, భల్లాలుడిపై పోరాటానికి అందుకు కట్టప్ప, అవంతిక ఎలా సాయం చేశారన్న లాంటి సీన్లను అద్భుతంగా చూపించాడు. వాటికి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ వెంట్రకలు నిక్కబోడుచుకునేలా ఉన్నాయి. చివర్లో బాహుబలిని పొడిచాక సీరియస్ గా కూర్చున్న కట్టప్ప, విబూతి రాసుకున్న శివుడు, ఆపై భల్లాలుడితో ఫేస్ టూ ఫేస్ ఇలా ట్రైలర్ కట్ అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali The Conclusion  Trailer Review  

Other Articles

Today on Telugu Wishesh