చిరు 151-బాలయ్య 102 క్లాష్... అస్సలు తగ్గట్లేదు | Balayya don't want to miss 2018 Sankranti.

Balakrishna ready to fight with uyyalavada

Bala Krishna 102 Movie, Chiru 151 versus Balayya 102, Uyyalavada Jayasimha, Bala Krishna Jayasimha, Jayasimha 2018 Sankranti, 2018 Tollywood Sankranti Race, 2018 Balayya Chiru, Chiranjeevi Uyyalavada, Balayya KS Ravikumar Movie

Bala Krishna 102 ready to clash with Chiranjeevi 151th Movie Uyyalavad .

2018 సంక్రాంతికి పోటీ తప్పదా?

Posted: 03/14/2017 12:45 PM IST
Balakrishna ready to fight with uyyalavada

రైతు లాంటి సబ్జెక్ట్ ఓరియంటల్ మిస్సయినప్పటికీ, పూరీ లాంటి క్రేజీ డైరక్టర్ తో తన 101వ చిత్రాన్ని అనౌన్స్ చేయటమే కాదు, అంతే వేగంగా షూటింగ్ ను ప్రారంభించి ఆశ్చర్యానికి గురి చేశాడు నందమూరి బాలకృష్ణ. ఇలా ముహుర్తం లాంఛ్ అయ్యిందో లేదో అలా సెప్టెంబర్ 29 అంటూ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయిపోయింది.

ఇక తన 151వ చిత్రంగా ఉయ్యాలవాడ నరసింహ రెడ్డిని ప్రారంభించి వచ్చే నెల నుంచి పట్టాలెక్కించబోతున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అది తెరకెక్కబోతుంది. నిదానంగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరి లో రిలీజ్ చేయాలని అంతా భావించారు. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ ఇద్దరు అగ్రహీరోల పోటీ ఉండబోదనే అంతా అనుకున్నారు. అయితే బాలయ్య మాత్రం పొంగల్ సీజన్ ను అస్సలు మిస్ కాకుడదనే ఆలోచనలో ఉన్నాడనే టాక్ ఇప్పుడు బయలు దేరింది.

తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ తో ఓ ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న సినిమాను 102వ చిత్రంగా బాలయ్య కమిట్ అయిన విషయం తెలిసిందే. తమన్నా హీరోయిన్ గా నటించబోతున్న ఈ సినిమా జూన్ లో ముహుర్తం ప్రారంభించుకోనుంది. అయితే దాని షూటింగ్ ను కూడా 101 తోపాటే కొనసాగించి సంక్రాంతి రేసులో నిలపాలని భావిస్తున్నాడంట. ఈ యేడాది ఖైదీ, శాతకర్ణిలు పోటాపోటీగా రిలీజ్ అయి కూడా కలెక్షన్లు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఆ ఛాన్స్ ను మిస్ చేసూకోకూడదనే బాలయ్య డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  151 Movie  Uyyalavada Narasimha Reddy  Bala Krishna  102 Movie  Sankranti Race  

Other Articles