కాటమరాయుడి కొత్త స్ట్రాటజీ.. డిస్ లైక్ ల డీజే ఎక్కడున్నాడు? | DJ dislikes new record.

Mumbai agency shocked with katamarayudu craze

Webgyor Tollywood, Pawan Kalyan, Pawan kalyan Craze, Katamarayudu Ad Agency, Sharat Marrar Business Plan, Sharat Marrar Katamarayudu, Jana Sena New Ad Agency, DJ Dislikes New Record, Duvvada Jagannadham Dislike Record, Webgyor Ad Agency Pawan Kalyan

Mumbai Agency Shocked With Pawan Kalyan's Craze. Webgyor, a noted digital marketing agency from Mumbai, has come on board for Pawan's Katamarayudu. It's said that the agency has wide network of clients and this is the firm's major move into South film industry, particularly into Tollywood. It's learnt that the same digital platform is also expected to handle Pawan Kalyan's Jana Sena account as well.

పవన్ క్రేజ్ చూసి షాక్ తిన్నారంట!

Posted: 03/07/2017 03:07 PM IST
Mumbai agency shocked with katamarayudu craze

ఎంత క్రేజ్ ఉన్న పెద్ద స్టారైనప్పటికీ సినిమా పబ్లిసిటీ తలనొప్పులు మాత్రం తప్పవు. అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడి కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు నిర్మాత శరత్ మరార్. గతంలో మా టీవీ సీఈవోగా పనిచేసిన శరత్ అంతకు ముందు అమితాబ్ ఏబీసీఎల్ కు దక్షిణాది విభాగానికి హెడ్ గా కూడా పని చేశాడు. ఆ మీడియా మేనేజ్ మెంట్ అనుభవంతోనే కాటమరాయుడి కోసం ముంబైకి చెందిన ఓ టాప్ ఏజెన్సీని కాటమరాయుడు కోసం పట్టుకొచ్చాడు.

ముంబై ఏజన్నీ వెబ్జీయార్ భారీ సినిమాలకు.. ప్రెస్టీజియస్ ప్రాజెక్టులకు డిజిటల్ కేంపెయిన్ సర్వీసులు చూసే ఓ సంస్థ. సౌత్ లో ఫస్ట్ టైం అది కూడా టాలీవుడ్ లో ఎంట్రీ చేస్తోంది. తొలి చిత్రమే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో కావటంతో ఆనందంగా అంగీకరించింది. అయితే పవన్ క్రేజ్ గురించి తెలిసినప్పటికీ టీజర్ రెస్పాన్స్ చూశాక వాళ్ల డెసిషన్ తప్పుకాదని హ్యాపీగా ఫీలవుతుందంట.

ఇక ఈ మధ్య రిలీజ్ అయిన మిరా మిరా మీసం సాంగ్ పవర్ వారిని షాక్ కి గురిచేసిందంట. ఓ స్టార్ హీరోకి ఈ రేంజ్ క్రేజ్ బాలీవుడ్ లో కూడా ఉండలేదని పొగడ్తలు కురిపిస్తున్నారు. అంతేకాదు ఇప్పుడీ కంపెనీ.. జనసేనకు సంబంధించిన ఆన్ లైన్ అకౌంట్ ను కూడా హ్యాండిల్ చేయనుందని టాక్.

ఇక టీజర్ 8.5 మిలియన్ దాటి కోటికి చేరువగా దూసుకుపోతుంది. అదే జరిగితే టాలీవుడ్ లో ఫస్ట్ టైం ఓ చెరగని ముద్ర కాటమరాయుడు వేసినట్లు అవుతుంది. మరోవైపు బన్నీ దువ్వాడ జగన్నాథమ్ కూడా 8 మిలియన్ వ్యూవ్స్ కి చేరువై కాటమరాయుడి వెనకాల నిలిచింది. ఈ టీజర్‌కు 1.6 లక్షల లైక్స్ వస్తే.. డిస్ లైక్స్ 1.5 లక్షలుగా ఉండటం విశేషం. సౌత్ ఇండియాలో మరే చిత్ర టీజర్ లక్ష కూడా ఈ ఫీట్ ను సాధించకపోవటం విశేషం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mumbai Ad Agency  Katamarayudu  Pawan Kalyan  

Other Articles