ఫ్యాన్ మీద కోపం ఫోన్ మీద చూపించాడు | Prakash Raj anti fan moment.

Actor prakash raj in another controversy

Actor Prakash Raj, Prakash Raj Phone, Prakash Raj Fan, Prakash Raj Airport, Prakash Raj Controversy, Angry Prakash Raj, Prakash Raj Anti Fan Moment, Prakash Raj 2017, Prakash Raj Upcoming Movies, Prakash Raj Controversy, Prakash Raj Selfie

Actor Prakash Raj in another controversy. This multi-talented Actor has been arriving from the intentional terminal of Chennai Airport recently. Hardcore fans of his have surrounded him as he crosses the exit gate. An enthusiastic fan took the liberty to go further and tried to take a selfie with Prakash Raj. Irritated Prakash has lost his cool and grabbed the fan’s mobile. He then hit the mobile to the floor which obviously broke into many pieces. Shocked fans tired of talking with Prakash Raj for his behavior. But the actor furiously walked towards his car and left the airport.

మరో వివాదంలో నటుడు ప్రకాశ్ రాజ్

Posted: 03/03/2017 03:29 PM IST
Actor prakash raj in another controversy

సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్. తరచూ సెట్స్ కి లేట్ గా రావటం, చిత్ర యూనిట్ సభ్యులతో గొడవ పెట్టుకుని రచ్చ చేయటం ఆ మోనార్క్ కి బాగా అలవాటే. దాదాపు అన్ని భాషల ఫిల్మ్ ఛాంబర్ లలో, ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ లో ఈయన గారిపై ఫిర్యాదులున్నాయంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ మధ్య అది కాస్త డైవర్షన్ తీసుకుని పొలిటికల్ రూట్ లోకి కూడా వెళ్లింది. కావేరీ జ‌లాల వివాదం, జల్లికట్టు లాంటి సున్నిత అంశాలపై తనదైన శైలిలో రెస్పాన్స్ కావటమే కాదు, ప్రశ్నించిన మీడియా వాళ్లపైనా ఫైర్ అయ్యాడు.

తాజాగా మరోసారి తన సహనం కోల్పోయి అభిమానితో దురుసుగా ప్రవర్తించాడు. ఓ చిత్రం కోసం విదేశాలకు వెళ్లిన ప్రకాశ్ రాజ్ బుధవారం ఉదయం చెన్నై విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాడు. ఎయిర్ పోర్ట్ లో అతన్ని చూసిన అభిమానులు ఆటోగ్రాఫ్ ల కోసం ఎగబడ్డారు. అయితే అప్పటి దాకా నవ్వుతూ ఉన్న ప్రకాశ్ రాజ్ సడన్ ఓ అభిమాని చేసిన పనితో చిరాకు పడ్డాడు.

సెల్ఫీ తీసుకోవాలని ముచ్చ‌ట‌ప‌డి, అందుకోసం ప్రయత్నించిన ఓ ఫ్యాన్ ఫోన్ ను లాక్కుని నేలకేసి పగలగొట్టాడు. ఆపై అక్కడి నుంచి తాపీగా వెళ్లిపోయాడు కూడా. దీంతో ఆ అభిమాని ఇష్టం లేకపోతే వద్దని చెబితే స‌రిపోయేది క‌దా అంటూ వాపోయాడు. వెంట‌నే విమానాశ్రయ అధికారులకు ఫిర్యాదు చేయగా, అప్పటికే ప్రకాష్ రాజ్ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లిపోవటంతో చేసేది ఏం లేక అంతా సైలెంట్ అయిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Prakash Raj  Fan Selfie  Controversy  

Other Articles

Today on Telugu Wishesh