ఆస్కార్ లో ఘన నివాళి.. మన పరువుపాయే! | Oscars paid homage to Om Puri

Oscar awards paid tribute to bollywood veteran actor

Bollywood Om Puri, Om Puri Oscars, Bollywood Actor Oscars 2017, Nawazuddin Siddiqui Om Puri, Nawazuddin Siddiqui Bollywood, Bollywood Awards Forget Om Puri, Om Puri Bollywood Homage, Nawazuddin Siddiqui Oscars

While Bollywood awards forgot Veteran Actor Om Puri, Oscars paid homage to him. Actor Nawazuddin Siddiqui slams on it.

ఓంపురికి ఆస్కార్ నివాళి.. బాలీవుడ్ సంగతేంటి?

Posted: 02/28/2017 11:05 AM IST
Oscar awards paid tribute to bollywood veteran actor

ఒక నటుడికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినప్పటికీ, సొంత ప్రాంతంలో అవమానం ఎదురయితే అది తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. బాలీవుడ్ వెటరన్ నటుడు, దివంగత ఓంపురి విషయంలో ఇప్పుడు సరిగ్గా అలాంటిదే జరిగింది. నిన్న జరిగిన 89వ ఆస్కార్ వేడుకల్లో ఆయనకు గౌరవం దక్కింది. దీంతో పురి కుటుంబ సభ్యులతోపాటు బాలీవుడ్ సెలబ్రిటీలంతా ఆ విషయమై తమ సంతోషం వ్యక్తం చేశారు.

అయితే సొంత గడ్డపైనే ఆయనకు సముచిత గౌరవం ఇవ్వకపోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్యే ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుక జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో ఆయనకు సంతాపం పాటించకపోవటం కాదు కదా కనీసం ఆయన గురించి ప్రస్తావన కూడా రాలేదు. దీంతో నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తన అంసతృప్తిని వ్యక్తం చేశాడు.

అకాడమీ అవార్డుల వేడుకల్లో తొలిసారి ఓ మహానటుడికి మ్యూజికల్ ఆల్బమ్ తో ఘనంగా నివాళ్లులు ఇచ్చారు. కానీ, బాలీవుడ్ కు మాత్రం అంత సమయం లేదు. ఇది సిగ్గు చేటు అంటూ పేర్కొన్నాడు ఈ విలక్షణ నటుడు. ఇండియన్ చలన చిత్ర పరిశ్రమ కొంత మంది చేతుల్లోనే ఉందన్న సిద్ధికీ, ఆ పరిస్థితి మారనంత కాలం ఇలాంటి అవమానాలు ఎదురవుతూనే ఉంటాయని తెలిపాడు. కాగా, 25 ఏళ్లుగా హాలీవుడ్ తోపాటు బ్రిటీష్ సినిమాల్లో నటించిన ఏకైక నటుడు ఓంపురియే కావటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Om Puri  89th Oscar Awards  Honored  Bollywood  Nawazuddin Siddiqui  

Other Articles