ఫ్యాన్స్ కోసం ఫోటోల రాయుడు.. క్లైమాక్స్ లీకయ్యిందా? | Pawan Kalyan as Photola Rayudu.

Die hard fans photos with pawan in katamarayudu sets

Katamarayudu Sets, Nithin with Katamarayudu, Bandla Ganesh katamarayudu, Katamarayudu Selfies, Selfie Rayudu Pawan Kalyam, Pawan Photos with Fans

Actor Nithin and Producer Bandla Ganesh Photos with Pawan Kalyan in Katamarayudu Sets.

అభిమానుల కోసం కాటమరాయుడి ఫోటోలు

Posted: 02/28/2017 10:09 AM IST
Die hard fans photos with pawan in katamarayudu sets

పవన్ కళ్యాణ్ సినిమా కాటమరాయుడు కు డెడ్ లైన్ ఫిక్స్ చేసేశారు. మార్చి 15 లోగా మొత్తం షూటింగ్ అయిపోతేనే ఫైనల్ అవుట్ పుట్ వచ్చి అనుకున్న టైంకి సినిమా రిలీజ్ అవుతుంది. అందుకే రాత్రింబవళ్లు షూటింగ్ లో బిజీగా ఉంటోంది చిత్ర యూనిట్. ప్రస్తుతం పాటల షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం రెండు వారాలపాటు ఏకదాటిగా బిజీగా ఉండబోతుందన్న మాట. అంతా అనుకున్నట్లు జరిగితే మార్చి 24నే అంటే నాలుగు రోజుల ముందుగానే సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

ఇక షూటింగ్ గ్యాప్ లో పుస్తకాలకే పరిమితమయ్యే పవన్ ఇప్పుడు కొత్త ట్రెండ్ ను సృష్టిస్తున్నాడు. చిత్రంలో తారాగణంతో సెల్ఫీల సందడి చేస్తున్నాడు. సినిమాలో తమ్ముళ్ల రోల్స్ చేస్తున్న శివబాలాజీ, అజయ్ లాంటి వాళ్లు తమ సోషల్ మీడియాల్లో ఎప్పటికప్పుడు అన్నయ్యతో దిగుతున్న ఫోటోలను అప్ లోడ్ చేసేస్తున్నాడు. ఇక చిత్ర సభ్యులే కాదు.. ఇప్పుడు బయటివారు కూడా షూటింగ్ స్పాట్ లో దర్శనమిస్తూ సెల్ఫీలతో అదరగొడుతున్నారు.

మొన్నామధ్యే సుబ్బిరామిరెడ్డి లాంటి పెద్దాయన కూడా పవన్ తో ఓ ఫోటో దిగిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అతి పెద్ద ఫ్యాన్ నితిన్ కూడా సందడి చేశాడు. కాటమరాయుడు లొకేషన్ కు వెళ్ళడమే కాదు.. అక్కడ ఏకంగా రాయుడు అండ్ బ్రదర్స్ తో ఒక స్నాప్ వేసుకున్నా నితిన్. ఒక ప్రక్కన తన సినిమా షూటింగులో బిజీగా ఉన్న నితిన్.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాటమరాయుడు షూటింగ్ స్పాటుకు వెళ్లి.. అక్కడ తన ఫ్యాన్ మూమెంట్ ను నిజం చేసుకున్నాడు. అన్నట్లు కాటమరాయడు నైజాం రైట్స్ ఈ వీరాభిమానికే దక్కిన విషయం తెలసిందే కదా.

 

క్యారెక్టర్ ఆర్టిస్ట్, నిర్మాత అయిన బండ్ల గణేష్ కూడా పవన్ ని ఎంత‌గా అభిమానిస్తాడో అంద‌రికీ తెలిసిందే. ప‌లు వేదిక‌ల‌పై పవన్ క‌ల్యాణ్‌ని ఆయ‌న దేవుడితోనూ పోల్చాడు కూడా. ఈ సంద‌ర్భంగా ఆ సినిమా సెట్‌కి వెళ్లిన బండ్ల గణేష్‌ పవన్ క‌ళ్యాణ్‌తో ఫొటోలు దిగాడు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ నే స్వ‌యంగా సెల్ఫీ తీశాడు. దీంతో గణేశ్ త‌న ఆనందాన్ని సోష‌ల్ మీడియాలో పంచుకున్నాడు. బాస్‌తో ఫొటో దిగాన‌ని పేర్కొన్నాడు. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ ఈ పోస్టుకి ‘దేవుడితో భక్తుడు సెల్ఫీ’ అని పేరుపెట్టేశాడు. ఇప్పుడే ఇలా ఉంటే వీళ్ల హడావుడి కాటమరాయుడు రిలీజ్ రోజున ఇంకెంతగా ఉండబోతుందో?

 

క్లైమ్యాక్స్ సీన్ లీకైందా? 

క్లైమ్యాక్స్ ఫైట్ ఫుటేజ్ ను లీక్ చేశారు కొందరు దండగులు. ఇంకా పూర్తిగా విజువల్ ఎఫెక్ట్స్ పూర్తవ్వని ఫుటేజ్ ఇప్పుడు బయటకొచ్చేసింది. పవన్ కళ్యాణ్ మరియు ఖైదీ నెం 150 ఫేం తరుణ్ అరోరా మధ్యన జరిగే ఫైట్ సన్నివేశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా కంప్యూటర్ గ్రాఫిక్స్ కూడా పూర్తవ్వని కోడింగ్ అలాగే ఏ విజువల్ ఎఫెక్ట్స్ ఏ కంపెనీకి ఇచ్చారు అనే విషయం గుర్తించడానికి ప్రత్యేకమైన నెంబరింగ్ కూడా ఉందట. దానితో ఎక్కడి నుండి లీకైందో తెలుసుకోవడం పెద్ద కష్టం కాదని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Katamarayudu  Pawan kalyan  Nithin  Bandla Ganesh  Photos  

Other Articles