అమీర్ కొత్త యాడ్ కాంట్రవర్సీ.. అసలు ఏముంది? | complaint over Aamir Khan advert for BMC Elections.

Aamir khan ad on bmc sparks controversy

Aamir Khan, Aamir Khan Ad Controversy, Aamir Khan BMC Elections, Aamir Khan Ad, Aamir Khan BJP, Aamir Khan Sivasena Congress, Aamir Khan Election Ad, Aamir Khan Election Commission

Bollywood star Aamir Khan drew flak for not voting and for merely appealing to the people to vote for better governance and change.A full-page advertisement featuring Bollywood star Aamir Khan in major newspapers on Tuesday has sparked a row, with parties like the Shiv Sena and the Congress alleging that it violated the election code of conduct and seemed to promote the ruling BJP.

అమీర్ ఖాన్ యాడ్.. బీజేపీకి సాయం.. వివాదం

Posted: 02/23/2017 10:58 AM IST
Aamir khan ad on bmc sparks controversy

ముంబై లో ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న వేళ బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన ఓ యాడ్ తీవ్ర దుమారం రేపింది. ఓ స్వచ్ఛంద సంస్థ రూపొందించిన ఈ యాడ్ అధికార బీజేపీకి అనుకూలంగా ఉందని విపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. కోడ్ ఉల్లంఘించి మరీ ఈ ప్రకటన ప్రసారం చేయటంతో బాధ్యలందరీపైనా చర్యలు తీసుకోవాలని అవి కోరాయి. అమీర్ & వైఫ్ పై పోలీస్ కేసు

అమీర్ ఖాన్ కు సంబంధించిన ఒక ప్రకటన ఇంగ్లిష్, హిందీ పత్రికల్లో ప్రధానంగా కనిపించింది. ముంబైలోని పలు సమస్యలను ఏకరువు పెడుతూ, మీకు నచ్చినవారికి ఓటెయ్యండి అన్నది. అయితే ఇది బీజేపీకి అనుకూలంగా ఉందంటూ శివసేన ఫిర్యాదు చేయగా, ఆ వెంటనే కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగింది. మార్పు, పారదర్శకత అన్న పదాలు బీజేపీని ఉద్దేశించే ఉన్నాయంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సచిన్ సావంత్ ఆరోపిస్తూ ఈసీకి ఫిర్యాదు చేశాడు.

అంతేకాదు యాడ్ రూపొందించిన ఎన్జీవోకు , మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కు మంచి సంబంధాలు ఉన్నాయన్నది వారి వాదన. ఎన్నికల కోడ్ ప్రకారం 19వ తేదీ సాయంత్రానికే అలాంటి ప్రకటనలను నిలిపివేయాలి. కానీ, వాళ్లు (ప్రభుత్వం, ఎన్జీవో సంస్థ) ఎన్నికల రోజు ఉదయం కూడా ప్రచారం చేశారు. ఆ లెక్కన ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ తెలిపారు.

అయితే దీనిపై ముంబై ఎన్నికల సంఘం అధికారి స్పందించాడు. ఎక్కువ శాతం ఓటింగ్ నమోదు కావాలనే ఆ యాడ్ ను రూపొందించారే తప్ప, ఏ ఒక్క పార్టీకో అది అనుకూలంగా లేదని ఆయన వివరించాడు. కానీ, దీనిపై ప్రధాన ఎన్నికల కమిషనర్ నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉంది. ఇక అమీర్ ఎన్నికల్లో ఓటు వేయకుండా షూటింగ్ లో పాల్గొనటంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు అమీర్ భార్య కిరణ్ మాత్రం తన ఓటు హక్కును వినియోగించుకుంది.

 

అమీర్ ఆ గౌరవం పోయింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Aamir Khan  BMC Elections  Ad  BJP  Controversy  

Other Articles