రాజమౌళి, క్రిష్ వీళ్లు మాత్రమే దర్శకులా? No recolonization for young directors in Tollywood.

Praised movie what about director

Sankalp Reddy, DIrector Sankalp Reddy, Ghazi Director Sankalp Reddy, Sankalp Reddy The Unsung Hero, Young Telugu Directors Problems, Rajamouli Krish, Tollywood Directors Domination, Ghazi Director

Sankalp Reddy the Unsung hero of Ghazi movie. Everybody praised the film and Rana Daggubati and the team of Ghazi for the movie. But not one of these celebrities decency to name director Sankalp Reddy or congratulate him personally on Twitter.

ఘాజీ దర్శకుడి గురించి మాట్లాడరెందుకు?

Posted: 02/20/2017 12:30 PM IST
Praised movie what about director

కేవలం హీరో, హీరోయిజం నుంచి కథ, కథనాల వైపు టాలీవుడ్ నెమ్మదిగా అడుగులు వేస్తుంది. పాత రోజుల్లో హీరోతోపాటు దర్శకుడి డామినేషన్ పై నమ్మకంతో జనాలు థియేటర్లకు క్యూ కట్టేవారు. కానీ, మధ్యలో హీరోల జోక్యంతో కథలే తారు మారు అవ్వటమే కాదు, దాని వెనుక కష్టం (టెక్నిషిన్లు) ను తెరపైకి తీసుకురాకపోవటం లాంటివి జరిగేవి. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారింది.

రాజమౌళి, క్రిష్ లాంటి రీసెర్చ్ లు చేసే దర్శకులు అందుకు ఆజ్యం పోశారు. సినిమా అంటే కేవలం హీరో ఒక్కడే కాదని, దాని వెనుక ఎంతో మంది కృషి ఉంటుందని చాటి చెప్పారు. అదే సమయంలో టాప్ దర్శకులుగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్నారు. అయితే కెప్టెన్ ఆఫ్ ది మూవీ షిప్ అయిన దర్శకుల గురించి ప్రస్తావించేందుకు తారతమ్య బేధాలు అనేవి పుట్టుకు రావటంతో పరిస్థితి మరోరకంగా మారుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

దేశ సినీ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా చరిత్రలో మనకు తెలియని ఓ టాపిక్ తో ఫస్ట్ సబ్ మెరైన్ కాన్సెప్ట్ ఘాజీ ను తెరకెక్కించాడు సంకల్ప్ రెడ్డి. హైదరాబాద్ కు చెందిన 32 ఏళ్ల సంకల్ప్ యూ ట్యూబ్ సెన్సేషన్ గా సుపరిచితుడే. అయితే ఓ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ను ఎంతో అనుభవం ఉన్న వాడిలా హ్యాండిల్ చేశాడంటూ క్రిటిక్స్ కూడా ఈ యువ దర్శకుడిపై ప్రశంసలు కురిపించారు. కానీ, సోషల్ మీడియాలో ఇతని గొప్ప గురించి ఒక్క సెలబ్రిటీ కూడా మచ్చుకు కూడా స్పందించకపోవటం దారుణం.

హీరో అయిన రానా గురించి, ఇందులోని మిగతా నటీనటుల గురించే తప్ప సినిమా కు సంబంధించిన టెక్నిషియన్ల గురించి ఎక్కడా ప్రస్తావన తేవటం లేదు. చివరకు అంతగా ప్రాధాన్యం లేని తాప్సీని కూడా పొగుడుతూ పలువురు ట్వీట్లు వేయటమే ఇక్కడ అసలు కొసమెరుపు. పొగడ్తలంటే కేవలం సీనియర్ దర్శకులకేనా, కొత్త వాళ్ల సంగతేంటూ పలువురు పశ్నిస్తున్నారు. సినిమా హిట్ అయితే సంబరపడిపోయి ఆ విజయాన్ని తమ ఖాతాలో వేసుకునే హీరోలు, ఫ్లాప్ అయితే మాత్రం డైరక్టర్ పై నెట్టేసి చేతులు దులుపుకుంటుంటారు.  మరి ఈ సబ్ మెరైన్ షిప్ ను విజయ తీరానికి చేర్చిన రియల్ కెప్టెన్ అయిన సంకల్ప్ ప్రతిభకు కనీసం ఇప్పుడైనా గుర్తింపు దక్కితే మంచిదన్నది కొందరి అభిప్రాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood Young Directors  Sankalp Reddy  Ghazi Director  

Other Articles