చిరు ఉయ్యలవాడ గా మారేది అప్పటి నుంచే... | Chiranjeevi to Launch Uyyalavada in April.

Chiru 151 launch muhurtham fix

Chiranjeevi 151, Uyyalavada Movie Launch, Uyyalavada Narasimha Reddy Launch Date, Chiranjeevi Uyyalavada Launch, Uyyalavada Narasimha Reddy Movie, Uyyalavada Narasimha Reddy Sankranti 2018, Chiranjeevi 151 Launch

Chiranjeevi to Launch Uyyalavada Narasimha Reddy. Megastar is set to launch his next movie in the month of April with much fanfare. Since he has cancelled the success celebrations of "Khaidi No 150", fans are disappointed. To please them, he said he would hold the launch of his next movie in big way.

చిరు 151 లాంఛ్ కి ముహుర్తం ఖరారు

Posted: 02/16/2017 10:46 AM IST
Chiru 151 launch muhurtham fix

ఖైదీ నంబర్ 150 గ్రాండ్ సక్సెస్ తర్వాత ప్రస్తుతం మీలో ఎవరు కోటీశ్వరుడు ద్వారా బుల్లితెరపై సందడి చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక రాజకీయాల్లో తక్కువగా కనిపిస్తానని చెబుతూనే టోటల్ గా తన సినీ కెరీర్ జెట్ స్పీడ్ తో సాగిపోతుందని చెప్పాడు. అంతేకాదు తన కలల ప్రాజెక్టు ఉయ్యలవాడ నరసింహా రెడ్డి తోనే రాబోతున్నట్లు సంకేతాలు అందించాడు కూడా. ఈ నేపథ్యంలో 151 ఎప్పుడు మొదలవుతుందని మెగా అభిమానులంతా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. చిరు 151.. పెద్ద రిస్కేనా?

ఇదిలా ఉండగా ప్రస్తుతం స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దే స్టేజీలో ఉన్నాడు స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి. ఏదీ ఏమైనా మీద ఏప్రిల్ లో ముహుర్తం లాంఛ్ చేసి, మే నుంచి రెగ్యులర్ చిత్ర షూటింగ్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఖైదీ సక్సెస్ మీట్ నిర్వహించకపోవటంతో నిరాశలో అభిమానులకు ఇది నిజంగా గుడ్ న్యూసే. సుమారు 80 కోట్ల బడ్జెట్ తో ఉయ్యలవాడను తెరకెక్కించబోతున్నారంట. ఓ ఫేమస్ బాలీవుడ్ సినిమాటోగ్రఫర్ తోపాటు మగధీర సినిమా కు పని చేసిన గ్రాఫికల్ టీం ను అల్రెడీ ఎంపిక చేశారు.

ఈ చిత్రం కోసం సరికొత్త లుక్కులో మెగాస్టార్ కనిపించబోతున్నాడని సమాచారం. అంతేకాదు సిక్స్ ప్యాక్ చేస్తానని అనౌన్స్ చేయటంతో ఫిట్ నెస్ పై కూడా ప్రత్యేక కేర్ తీసుకున్నట్లు భోగట్టా. అంతా అనుకున్నట్లు జరిగితే 2018 సంక్రాంతి కి ఉయ్యలవాడ నరసింహా రెడ్డి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  151 Movie  Uyyalavada Narasimha Reddy  Launch Date  

Other Articles

Today on Telugu Wishesh