ఇంకా బిచ్చగాడి మాయలోనే ఉన్నారా? | Vijay Antony needs another Bichchagadu.

Huge expectations on vijay antony yaman

Yaman Telugu Business, Vijay Antony Yaman, Yaman Telugu Movie, Yaman Telugu Business, Yaman Hero, Yaman Buyers, Yaman Bethaldu

Shocking Business for Vijay Antony’s Yaman Telugu Version. Even though Bethaludu didn’t live up to the expectations, buyers are hoping that he would recreate the magic of Bichagadu as Yaman.

విజయ్ యమన్ బిజినెస్ భారీగానే...

Posted: 02/15/2017 11:23 AM IST
Huge expectations on vijay antony yaman

ఓ రీమేక్ తో వచ్చి టాలీవుడ్ లో విజయ్ ఆంటోనీ క్రియేట్ చేసిన సెన్సేషన్ ను ఇంకా ఎవరూ మరిచిపోలేదు. అంతకు ముందు నకిలీ, డాక్టర్ సలీమ్ తో కాస్త పరిచయం ఉన్న అతగాడిని బిచ్చగాడితో అక్కున్న చేర్చుకున్నారు తెలుగు ప్రేక్షకులు. అంతేకాదు విజయ్ సినిమా అంటే అందులో ఏదో ఒక సమ్ థింగ్ స్పెషల్ ఉంటుందన్న అంచనాలను కూడా క్రియేట్ చేశాడు. అయితే అదే ఊపులో భేతాళుడు అంటూ ఓ థ్రిల్లర్ డ్రామాతో వచ్చినప్పటికీ ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు.

ఇక ఇప్పుడు యమన్ పేరుతో ఓ పొలిటికల్ డ్రామాతో రాబోతున్నాడు. తెలుగులోనూ అదే పేరుతో రాబోతున్న ఈ చిత్ర ట్రైలర్ ఈ మధ్యే రిలీజ్ అయ్యింది. మూడు రోజుల్లోనే 5 లక్షల మంది దాన్ని వీక్షించారు కూడా. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి భారీగానే బిజినెస్ జరిగినట్లు సమాచారం. భేతాళుడు బయ్యర్లకు నష్టాన్ని మిగిల్చినప్పటికీ విజయ్ కి ఉన్న క్రేజ్ పై నమ్మకం, పైగా నకిలీ తీసిన జీవా శంకర్ దర్శకుడు కావటంతో గ్యారెంటీ హిట్ అన్న నమ్మకంతో ముందుకు వస్తున్నారంట.

 

మియా జార్జీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో దాదాపు అంతా కొత్త వాళ్లే నటించారు. ట్రైలర్ లో విజయ్ లుక్కు, యాక్టింగ్ అంతా ఆ హైప్ కి తగ్గట్లుగానే ఉంది. శివరాత్రి సందర్భంగా ఈ నెల 24న విడుదల కానుంది. మరి ఈ యమన్ మరో భేతాళుడు అవుతుందా? లేక బిచ్చగాడు అవుతుందా? అన్నది వేచి చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Antony  Yaman  Telugu Movie  Rights  

Other Articles