ప్రభాస్ #19... 150 కోట్ల మూవీ మరీ ఇంత సింపుల్ గానా? | Prabhass next with Sujeeth starts rolling.

Prabhas new movie launched

Prabhas New Movie, Prabhas Movie Shooting Starts, Prabhas and Sujeeth Film, Prabhas Big Budget Movie, UV Creations Prabhas, Prabhas New Movie Launch, Prabhas Multilingual Movie Launch, Prabhas 19th Movie, Krishnamraju Clap Prabhas

Prabhas new film launched. Sujeeth Direct the Movie. In Telugu, Tamil, Hindi. under UV Creations Banner Music composed by Shankar-Ehsaan-Loy. Shoot starts soon.

ప్రభాస్ కొత్త సినిమా షురూ అయ్యింది

Posted: 02/13/2017 12:39 PM IST
Prabhas new movie launched

బాహుబలి సిరీస్ షూటింగ్ ముగియటంతో నెక్స్ట్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. తన కోసమే రెండున్నరేళ్లుగా ఎదురు చూస్తున్న డైరక్టర్ సుజిత్ సినిమాకు ఎట్టకేలకు పూజా కార్యక్రమాలు ప్రారంభించేశారు. సోమవారం ఉదయం ఏ హడావుడి లేకుండానే షూటింగ్ ప్రారంభమైంది.

ప్రభాస్, దర్శకుడు సుజిత్ తోపాటు నిర్మాతలు వంశీ, ప్రమోద్ మరికొందరు టీం టెక్నిషియన్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సీనియర్ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు ముహుర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టాడు. ఇక కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కబోతుంది. సుమారు 150 కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రం కోసం బాలీవుడ్ సంగీత దర్శకులు పని చేయబోతుండగా, కేవలం 25 కోట్లతో ఓ భారీ ఫైట్ ను రూపొందించబోతున్నారు.

ట్రాన్స్ ఫార్మర్స్ లాంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన స్టంట్ మాస్టర్ కెన్నీ బీట్స్ దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాలో దీన్ని తీయబోతున్నారంట. ప్రముఖ కెమెరామెన్ మది దీనికి పని చేయబోతున్నాడు. ఇంకా హీరోయిన్ ను ఎంపిక చేయని ఈ సినిమా మే నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అప్పటి దాకా బరువు తగ్గి స్టైలిష్ లుక్కులోకి మారిపోనున్నాడు మన బాహుబలి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Sujeeth  Launch photos  

Other Articles