హిట్ టాక్ అయినా అక్కడ అంతంత మాత్రమే | nNo business for ONV and Sigam at overseas.

Dull show for om namo venkatesaya and singam 3

Nagarjuna Om Namo Venkatesaya, Om Namo Venkatesaya First Day Collections, Om Namo Venkatesaya Singam 3, Singam 3 First Day Collections, Om Namo Venkatesaya Singam 3 Overseas, Singam 3 Overseas Collections, ONV First Day Collections

Telugu films are under performing this weekend. Not a single movie scored decent collection. This is a big shock to the distributors. This year all the new releases have got stunning openings but this weekend, new releases as well as earlier movies have scored way below. Nagarjuna's "Om Namo Venkatesaya" just grossed mere 27k dollars on Friday. Its Thursday premeire shows were also shockingly low. Suriya's "Singam 3" also reported just 46k dollars on Friday. The movie's overall collections so far including Tamil and Telugu versions are just about $100+k. On the other hand, "Nenu Local" is also not showing any growth this weekend. On Friday, it got just $21k dollars. It needs another 120k dollars to touch the million-dollars mark.

సింగం, ఓం నమో వీకెండ్ డల్ షోలు

Posted: 02/11/2017 05:15 PM IST
Dull show for om namo venkatesaya and singam 3

సంక్రాంతి రేసు ముగిశాక టాలీవుడ్ లో మళ్లీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాల సందడి మొదలైంది. సినీ క్యాలెండర్ లో అన్ సీజన్ గా పేర్కొనే ఫిబ్రవరిలో సినిమాలు రిలీజ్ చేసేందుకు ఎవరూ ముందుకు రారు. అవసరమైతే సమ్మర్ కి పోస్ట్ పోన్ చేసుకునే వారు. అయితే మూడేళ్ల క్రితం వచ్చిన మిర్చితో ఆ సిచ్యుయేషన్ మొత్తం మారిపోయింది. ఆపై వరస ఏడాదుల్లో టెంపర్, గతేడాది కృష్ణగాడి వీర ప్రేమగాథ, క్షణం లాంటి సినిమాలు రికార్డు కలెక్షన్లతో ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసేశాయ్.

దీంతో పండక్కి మిస్సయిన నిర్మాతలు ఫిబ్రవరిలోనే తమ సినిమాలు రిలీజ్ చేసుకుంటున్నారు. ఈసారి కూడా అన్నిరకాల జోనర్లతో ఫిబ్రవరి సందడిగా మారనుందని చెప్పుకున్నాం. గత వారం విడుదలైన నేను లోకల్ ఇప్పటికే పెట్టుబడిని వెనక్కి తెచ్చేయగా, ఇక లాభాలను రప్పించటమే మిగిలింది. ఇదిలా ఉండగానే ఈ వారం మరో రెండు సినిమాలు బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయగా వాటి ఫలితాలు మాత్రం కొంచెం నిరాశ కలిగిస్తున్నాయి.

పూర్తి మాస్ కంటెంట్ తో వచ్చిన సింగం-3 కి యావరేజ్ టాక్ రాగా, నాగ్ డివోషనల్ డ్రామా నమో వేంకటేశాయకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో ఈ రెండు చిత్రాలు కలెక్షన్లు రాబట్టడం ఖాయమని అంతా ఫీలయ్యారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో వీటి కలెక్షన్లు అంతంత మాత్రంగా ఉండగా, ఓవర్సీస్ లో మాత్రం భారీగానే దెబ్బపడినట్లు అర్థమౌతోంది.

ముఖ్యంగా అంచనాలను పటాఫంచల్ చేస్తూ భారీ బిజినెస్ చేసిన నమో వేంకటేశాయ మొదటి రోజు కేవలం 27కే డాలర్లు రాబట్టడం దారుణం. ఈ నేపథ్యంలో ఎక్స్ ట్రార్డినరీగా పుంజుకుంటే తప్ప అక్కడి బయ్యర్లు సేఫ్ అయ్యే పరిస్థితిలో లేరు. మరోవైపు సింగం కూడా రెండో రోజు 46కే డాలర్లు రాబట్టి కాస్త ఫర్వాలేదనిపించింది. తమిళ వర్షన్ కూడా ఉండటంతో కాస్తలో కాస్త సేఫ్ జోన్ వెళ్లే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే మిలియన్ మార్క్ కి చేరువలో ఉన్న నాని నేనులోకల్ కేవలం 21కే డాలర్లతోనే సరిపెట్టింది. మరో 120కే సాధిస్తే తప్ప మిలియన్ డాలర్ మార్క్ ను టచ్ అవుతాడు. కాబట్టి ఆ రెండు జోనర్ల సినిమాలను తట్టుకుని నాని నిలబడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Om Namo Venkatesaya  Singam-3  Nenu Local  Overseas Collections  

Other Articles