ఐటెం సాంగ్ పై బూతులు.. గూగుల్ లో వెతుక్కోమంటూ అనసూయ రిప్లై | Anasuya's Fitting Reply on Item Song Controversy.

Anasuya strong reply to item song controversy

Anasuya Item Song, Winner Item Song Controversy, Anasuya Buddha Statue, Item Song Buddha Statue, Buddha Statue Anasuya, Anasuya Item Song Controversy, Suya Suya Song Controversy, Anasuya Fitting Reply, Anasuya Buddha Bar, Anasuya Item Song Locations

Some netizens on social media targeted the team of 'Winner' accusing it of filming an item song in front of 'Buddha' statue. Decided not to take this foolish criticism, Anasuya has now given a fitting reply to all those haters on social media.

ఐటెం సాంగ్ వివాదంపై స్పందించిన అనసూయ

Posted: 02/10/2017 10:59 AM IST
Anasuya strong reply to item song controversy

ఛాన్స్ దొరికితే చాలూ సినిమాల్లో చిన్న చిన్న లోపాలను వెతికి మరీ వివాదాలు రేపుతుంటారు కొందరు. ఫస్ట్ టైం ఐటెం సాంగ్ తో తెలుగులో సందడి చేయబోతున్న హాట్ యాంకర్ అనసూయకు కూడా ఇలాంటి చిక్కే ఒకటి ఎదురయ్యింది. అయితే దానికి గట్టి కౌంటరే ఇచ్చిందీ హాట్ బ్యూటీ.

రీసెంట్ గా విన్నర్ సినిమాలో సూయ, సూయ అంటూ ఓ ఐటెం సాంగ్ లో అనసూయ నటించిన విషయం తెలిసిందే. ఈ పాటను మరో టాలీవుడ్ క్రేజీ యాంకర్ సుమ కనకాల అలాపించటం తెలిసిందే. అయితే ట్రాక్ ను విడుదల చేసిన సందర్భంలో కొన్ని విజువల్స్ కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. అందులో బుద్ధ విగ్రహం ముందు ఈ పాటను చిత్రీకరించటంపై మండిపడ్డారు పలువురు. దీంతో రంగంలోకి దిగిన అనసూయ మంచి కౌంటరే ఇచ్చింది.

ఈ స్పెషల్ సాంగ్ ను ఉక్రెయిన్ లోని ‘బుద్ధ బార్’ అనే ఓ పబ్ లో చిత్రీకరించాం. అదేం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసింది కాదు, అక్కడ అల్రెడీ ఆ విగ్రహాం ఉంది. మీకు అంతగా డౌట్లు ఉంటే గూగుల్ లోకి వెత్కుకోండంటూ విమర్శకులకు సమాధానమిచ్చింది. అంతేకాదు విగ్రహాం ముందు పార్టీలు, డాన్సులు చేసుకోవటానికి లేని ఇబ్బంది మేము పాటను చిత్రీకరిస్తే వచ్చిందా అంటూ మండిపడింది. అంతేకాదు రైటర్ సిరాశ్రీని టార్గెట్ చేస్తూ వచ్చిన విమర్శలపై స్పందిస్తూ.. ఇతరులకు గౌరవం ఇవ్వలేనివారు దేవుడి గురించి మాట్లాడటం సరికాదంటూ పేర్కొంది.

ఇంతకు ముందు ఇదే రీతిలో రాంచరణ్ రచ్చ సినిమాలో వాన వాన... పాటకు బుద్ధ విగ్రహాం అంటూ విమర్శలు రాగా, దానిని బ్లర్ చేస్తూ విజువల్స్ తో కవర్ చేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anchor Anasuya  Winner Item Song  Buddha Statue  Controversy  

Other Articles