రవితేజ సగం ప్రామిస్ నెరవేరింది | Ravi Teja Touch Chesi Chudu Movie shooting launched.

Ravi teja touch chesi chudu shooting starts

Mass Raja Ravi Teja, Ravi Teja Touch Chesi Choodu, Touch Chesi Choodu Shooting, Touch Chesi Choodu Muhurtham Launched, Touch Chesi Choodu Opening, Touch Chesi Choodu Movie, Touch Chesi Choodu Clap, Touch Chesi Choodu Pooja Launch, Touch Chesi Choodu Shooting Begins, Touch Chesi Choodu Anil Kapoor, Touch Chesi Choodu

Mass Raja Ravi Teja Touch Chesi Choodu movie launch officially.

మాస్ రాజా టచ్ చేసి చూడు షూటింగ్ ప్రారంభం

Posted: 02/03/2017 01:45 PM IST
Ravi teja touch chesi chudu shooting starts

ఏడాదిన్నర గ్యాప్ తర్వాత మళ్లీ మాస్ రాజా కెమెరా ముందుకు దర్శనమిచ్చేశాడు. లాంగ్ హాలీడే్స్ ను ఎంజాయ్ చేసి తిరిగొచ్చాక ఎన్నో కథలు విన్నప్పటికీ ఒక్కదాన్ని కూడా ఓకే చేయలేకపోయాడు. అయితే రెమ్యునరేషన్ ఓకే కాకనే రవితేజ ఇలా చేస్తున్నాడంటూ విమర్శలు వినిపించాయి. ఏది ఏదైతేనేం ఎట్టకేలకు ఒకేసారి రెండు ప్రాజెక్టులకు ఓకే చెప్పి మళ్లీ హైలెట్ అయ్యాడు రవితేజ.

అందులో ఒకటి విక్రమ్ సిరికొండ డెబ్యూ డైరక్టర్ తో చేయబోయే టచ్ చేసి చూడు, మరోకటి అనిల్ రావిపూడి రాజా ది గ్రేట్. అల్రెడీ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయిన టచ్ చూసి చూడు షూటింగ్ ఈరోజు మొదలుపెట్టేశారు. హీరో ర‌వితేజ‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు దృశ్యానికి నిర్మాత‌ల్లో ఒక‌రైన వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్ క్లాప్ ఇవ్వ‌గా, సీనియ‌ర్ ఎడిట‌ర్ గౌతంరాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వీవీ వినాయ‌క్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ రోజు నుంచి చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ జరుపుకోనుండగా వారం రోజుల‌కు పైగా ఇక్క‌డే తొలి షెడ్యూల్ జరగనుంది. ఇక త‌దుప‌రి షెడ్యూల్ ని పాండిచ్చేరిలో 25 రోజులు జరపనున్నారు. రాశి ఖన్నా, లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రీతం సింగ్ సంగీతం అందించనున్నాడు. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.

రీసెంట్ గా ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన రవితేజ థాంక్స్ షూటింగ్ ప్రారంభమైందని ఓ వీడియోను కూడా పోస్ట్ చేయటం విశేషం. మరోవైపు అనిల్ రావిపూడి రాజా ది గ్రేట్ లో అంధుడి పాత్రలో మాస్ రాజా నటించబోతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే అఫీషియల్ గా ప్రారంభం కానుంది. మొత్తానికి గతేడాది లోటును రెండు సినిమాలతో ఒకేసారి పూరీంచనున్నాడు రవితేజ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Touch Chesi Choodu  Ravi Teja  Shooting  

Other Articles