గోపీచంద్ సినిమాకు పవన్, ఎన్టీఆర్ తో కనెక్షన్ ఏంటంటే... | Gopichand Gets Oxygen From PK and NTR.

Oxygen gearing up for summer release

Oxygen Movie, Oxygen Movie Heroines, Oxygen Pawan Kalyan NTR, Gopichand Oxygen Movie, Oxygen Movie Release Date, Oxygen Audio Release, Oxygen Telugu Movie, Oxygen Movie 2017

Gopichand is all set to strike back with Oxygen directed by Jyothi Krishna. This film is gearing up for summer release and luckily for Gopichand, both his leading ladies are making buzz in Tollywood lately. Rashi Khanna is roped in for Jai Lavakusa to romance none other than Junior NTR and the other female lead of Oxygen, Anu Emmanuel is going to play one of the female leads in Pawan’s next film with Trivikram. Both these ladies were not on the A-list of Tollywood actresses, but now they have become talk of the industry by bagging big ticket films.

ఆక్సిజన్ సినిమా సమ్మర్ లోనే ఎందుకంటే...

Posted: 02/03/2017 09:12 AM IST
Oxygen gearing up for summer release

యాక్షన్ స్టార్ గోపీచంద్ కు హిట్ ఇప్పుడు చాలా అవసరం. లౌక్యం తర్వాత హిట్ లేని ఇతగాడు ప్రస్తుతం సంపత్ నంది సినిమాతో బిజీగా వున్నాడు. మాస్ ఆడియన్స్ పల్స్ సంపత్ నందికి బాగా తెలుసు కనుక, ఈ సినిమాపై గోపీచంద్ ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. అయితే దీనికంటే ముందే 'ఆక్సిజన్' అనే సినిమాను పూర్తి చేశాడు. జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎందుకనో ఇంకా రిలీజ్ కు నోచుకోలేదు. అప్పుడెప్పుడో ఫస్ట్ లుక్ అంటూ హడావుడి చేసినప్పటికీ, నాలుగు నెలల క్రితమే షూటింగ్ అయిపోయినప్పటికీ, ఇప్పటిదాకా ఈ ప్రాజెక్టుపై ఓ క్లారిటీ రాలేదు.

ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకి చేరుకున్నాయి. దాంతో ట్రైలర్ ను వదలడానికి ఈ సినిమా టీమ్ సిద్ధమవుతోంది. అదే సమయంలో సినిమా రిలీజ్ పై కూడా యూనిట్ ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుపై జనాల్లో ఆసక్తి క్రియేట్ చేయాలంటే ఆక్సిజన్ ను సమ్మర్ రేసులో నిలపటమే కరెక్టని భావిస్తున్నారంట. దీనికి కారణం ఇందులో నటిస్తున్న హీరోయిన్లు రాశిఖన్నా .. అనూ ఇమ్మాన్యుయేల్.

ప్రస్తుతం రాశిఖన్నా ఎన్టీఆర్-బాబీ కాంబోలో తెరకెక్కుతున్న జై లవకుశకి ఎంపికైన విషయం తెలిసిందే. మరోవైపు అనూ ఇమ్మాన్యుయేల్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ ప్రాజెక్టులో హీరోయిన్ లో హీరోయిన్ గా చేస్తుంది. సినిమా రిలీజ్ సమయానికి వాళ్లిద్దరూ షూటింగ్ సెట్స్ లో ఆరకంగా వాళ్లు వార్తల్లో నానుతుంటారు. కాబట్టి ఆ టైంకి ఆక్సిజన్ ను రిలీజ్ చేస్తే రిజల్ట్ మరోలా ఉండొచ్చని టీం భావిస్తోందని తెలుస్తోంది. చూద్దాం ఈ స్కెచ్ వర్కవుట్ అవుతోందో లేదో?.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Oxygen  Telugu Movie  Gopichand  Release Date  

Other Articles

Today on Telugu Wishesh