అఫీషియల్: మెగా మల్టీస్టారర్ మూవీ.. త్రివిక్రమ్ డైరక్టర్ | Chiru and Pawan Multi starrer under Trivikram Direction.

Chiru and pawan together for a movie

Subbirami Reddy Multi-Starrer, Power star Pawan Kalyan, Chiru and Pawan kalyan, Pawan Kalyan and Chiranjeevi, Mega Multi-Starrer Movie, Subbirami Reddy Aswini Dutt, Aswini Dutt Subbirami Reddy, Chiranjeevi Pawan Kalyan Movie, Mega Multi-Starrer Movie

T Subbirami Reddy along with Aswini Dutt to produce a Multi-starrer with Megastar Chiranjeevi-Powerstar Pawan Kalyan in Trivikram's direction.

చిరు-పవన్ మల్టీస్టారర్.. త్రివిక్రమ్ డైరక్షన్?

Posted: 02/02/2017 04:43 PM IST
Chiru and pawan together for a movie

మెగా ఫ్యాన్స్ అదిరిపోయే న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. చిరు, పవన్ కాంబినేషన్ లో త్వరలో ఓ కొత్త సినిమా రూపుదిద్దుకోబోతుంది. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ ప్రాజెక్ట్ కు త్రివిక్రమ్ దర్శకత్వం వహించబోతున్నాడని సమాచారం. కాలబంధు టీ సుబ్బిరామిరెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

ఆ మధ్య ఖైదీ నంబర్ 150 టీంకు సత్కారం చేసిన పంక్షన్ లోనే ఈ మెగా బ్రదర్స్ తో ఓ మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నట్లు ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు సుబ్బిరామి రెడ్డి. అయితే ఇంత భారీ కాంబినేషన్ సెట్ అవ్వడానికి చాలా సమయం పడుతుందని భావించారు ఫ్యాన్స్. కానీ అతి త్వరలోనే ఇది కార్యరూపం దాల్చనున్నట్లు తెలుస్తోంది.

సుబ్బిరామిరెడ్డితో పాటు అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నాడంట. కొంత కాలంగా మెగా ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ దూరమవుతున్నాడన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో చిరు, పవన్లు కలిసి ఒకే సినిమాలోనటిస్తున్నారన్న వార్త అభిమానులను ఖుషీ చేస్తోంది. అయితే చిరు 151 సురేందర్ రెడ్డితో, 152 బోయపాటితో అల్రెడీ కమిట్ అయ్యాడు ఉన్నాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఏమో కాటమరాయుడు తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో, ఆపై ఏఎం రత్నం నిర్మాణంలో ఓ సినిమా, దాసరి సినిమా లైన్ లో ఉన్నాయి. ఆ మధ్య అశ్వనీదత్ కూడా తాను సోలోగానే సినిమా తీస్తానని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఈ మెగా మల్టీస్టారర్ కార్యరూపం దాల్చటం అనేది అనుమానంగానే కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఎవరి దగ్గరి నుంచి అధికారిక ప్రకటన లేకపోయినా టాలీవుడ్ సర్కిల్స్, మీడియాలో ఈ వార్త తెగ హల్చల్ చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Subbirami Reddy  Chiranjeevi  Pawan Kalyan  Multi-Starrer  

Other Articles