స్టార్ హీరోలకు, వారసులకు నాని పంచ్ వేశాడే... | Nani Satires to Star Heroes.

Nani comments on star heroes and kids

Nani Nenu Local Interview, Hero nani Interview, Nani Latest Interview, Nani 2017 Movies, Nenu Local Interview, Nani on Nenu Local Delay, Nani Star Kids, Nani Comments on Star Heroes, Hero Nani Punch, Nenu Local Hero Nani, Nani Nenu Local Interview, Nani Interview

Hero Nani Satires on Star Heroes and Kids in Nenu Local Interview.

స్టారకు, వారసులకు నాని పంచ్

Posted: 01/30/2017 06:11 PM IST
Nani comments on star heroes and kids

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి డబుల్ హ్యాట్రిక్ కొట్టే స్థాయికి ఎదిగిపోయిన నాని, నేచురల్ స్టార్ అనే ట్యాగ్ లైన్ తో అందరికీ ఫేవరెట్ మారిపోయాడు. హీరోలు, వారసులు, ఫ్యాన్స్ వార్ ఓవైపు కొనసాగుతుంటే... నానికి మాత్రం ఆ గోలతో సంబంధమే లేకుండానే దూసుకుపోతున్నాడు. అయితే ఇంత సక్సెస్ రేటు ఉన్నా కూడా ఆ గర్వం నెత్తికి ఎక్కించుకోకుండా అందరితో కలివిడిగా ఉంటూ వస్తున్నాడు.

ఇదిలా ఉంటే గతేడాదిలాగే ఈ యేడాది కూడా మూడు సినిమాలతో పలకరించబోతున్నాడంట. అందులో ముందుగా నేనులోకల్ తో సందడి చేయబోతున్నాడు. అల్రెడీ యూ బై ఏ సర్టిఫికెట్ దక్కించుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 3న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సమయం ఎక్కువ లేకపోవటంతో ప్రమోషన్ లో కూడా పొల్గొంటూ బోలెడు విషయాలు చెప్పుకొస్తున్నాడు. డిసెంబర్ నెలాఖరుకే రావాల్సిన సినిమా వాయిదా పడటంపై చాలా విమర్శలు వినిపించాయి. చివరకు కీర్తి సురేష్ కారణంగానే సినిమా లేట్ అయ్యిందని ఓ వార్త వచ్చింది.

దీనిపై నాని స్పందించాడు. సినిమా లేట్ కి కీర్తి కారణమే కానీ, ఆమె బిహేవియర్ మూలంగా కాదు. ఓవైపు విజయ్ లాంటి స్టార్ హీరోతో భైరవ లాంటి పెద్ద సినిమా చేసింది, అలాంటి సమయంలోనే నేను లోకల్ లో పాల్గొంది అక్కడే కాస్త లేట్ అయ్యిందని చెప్పుకొచ్చాడు.

ఇక స్టార్ వారసులకు సూటిగా తగిలేలా కొన్ని పంచ్ లు కూడా వేశాడు లేండి. తనకు బ్యాగ్రౌండ్ లేదని కొందరు అంటుంటారని.. కానీ దాన్ని తానో వరంగా భావిస్తానని చెప్పాడు. ఎవరైనా తన దగ్గరికి ఎవరైనా వచ్చి నేను నీ ఫ్యాన్ అంటే.. కచ్చితంగా అతను తన ఫ్యానే అని గర్వంగా ఫీలవుతా అని చెప్పాడు. అంటే స్టార్ కిడ్స్ కు వాళ్ల తండ్రుల ఫ్యాన్సే ఎక్కువ ఉంటారన్న అర్థం వచ్చేలాగ అన్న మాట. ఇక నిజమైన హిట్ కు డెఫినేషన్ చెబుతూ... లైట్ బాయ్ దగ్గర్నుంచి డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్లు అందరికీ సంతోషాన్ని తెచ్చిపెట్టేదే అన్నాడు. ఆ లెక్కన కొన్నిసార్లు భారీ వసూళ్లు సాధించిన సినిమాలు కూడా డిస్ట్రిబ్యూటర్లకు కొద్దో గొప్పో నష్టాలను తెచ్చిపెడతాయని, అలాంటివి నిజమైన హిట్లు కావంటూ ఇండైరక్ట్ గా సెటైర్ వేశాడన్నమాట. నాని ఏ ఉద్దేశ్యంతో అన్నాడో తెలీదు గానీ ఆ వ్యాఖ్యలు మాత్రం స్టార్ కిడ్స్ పైనే నంటూ ఇప్పుడు చర్చ మొదలైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hero Nani  Nenu Local  Interview  

Other Articles