కాజల్ చూపించాలంటే ఓ కండిషన్ కంపల్సరీ అంట ! | Kajal need Kick for Item Song.

Kajal condition for item songs

Kajal Agarwal, Item Song, Kajal Item Song, Kajal Agarwal Condition, Kajal Agarwal Kick, kajal Agarwal Item Song, Kajal Agarwal 2017, Kajal Agarwal Latest

Kajal Agarwal ready for more item Songs. But If she likes song then only she committed.

ఐటెం సాంగ్ కి కండిషన్ పెడుతున్న కాజల్

Posted: 01/28/2017 12:26 PM IST
Kajal condition for item songs

గతేడాది సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం, కోలీవుడ్, బాలీవుడ్ లో ఒక్కో డిజాస్టర్లతో పలకరించింది కాజల్ అగర్వాల్. అయితేనేం జనతా గ్యారేజ్ లో చేసిన పక్కా లోకల్ సాంగ్ తో ఓ ఊపు ఊపేసింది చందమామ. ఓవైపు ఖైదీ నంబర్ 150 లాంటి ప్రెస్టిజియస్ ప్రాజెక్టులో అప్పటికే హీరోయిన్ గా కన్ఫర్మ్ అయినప్పటికీ, ఐటెం నంబర్ తో తనకు వచ్చే నష్టం ఏం లేదన్న ధీమాతోనే కానిచ్చేసింది. మరి ఫ్యూచర్ లో మరిన్ని ఐటెం సాంగ్ లు చేసేందుకు సిద్ధమా? అంటే మాత్రం కండిషన్ అప్లై అంటోంది.

తనకు అవకాశాలిస్తే మరిన్ని ఐటెంసాంగ్ లు చేస్తానని చెబుతూ కానీ, పాట మాత్రం తనకు నచ్చాలంటోంది. నిజానికి లోకల్ సాంగ్ ఊర మాస్ బీట్ కావటం మూలంగానే ఒప్పుకున్నానని, ఆఫర్లతో వచ్చే వారు కూడా అలాంటి పాటలతో వస్తేనే ఆలోచిస్తానంటోంది. అదే సమయంలో అందుకు తగ్గట్లే ఓ రేంజ్ లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందని టాక్. ఇప్పటికే తమన్నా, శృతీహాసన్ లు ఐటెంలతో చెలరేగిపోతుంటే.. ఇలా ఆఫర్ ఇచ్చేసి వాళ్లకి టఫ్ కాంపిటీషన్ ఇస్తానంటోంది.

మరోవైపు ఖైదీ నంబర్ 150 లో మెగాస్టార్ పక్కన మెరిసినా క్యారెక్టర్ అంత స్ట్రాంగ్ లేదంటూ క్రిటిక్స్ విమర్శలు వినిపించారు. దీంతో ఈ యేడాది చేతిలో ఉన్న రానా-తేజ ప్రాజెక్టు నేనేరాజు నేనే మంత్రి సినిమాపై ఆశలు పెట్టుకుంది. ఇక మరోవైపు కాజల్ కిక్కు ఇవ్వబోయే ఆ రెండో ఐటెం సాంగ్ కోసం అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kajal Agarwal  2017  Item Songs  

Other Articles