ఖుల్లం-ఖుల్లా: తండ్రికి హీరోయిన్లతో లింకులు, దావూద్ తో టీపార్టీ, అవార్డు కొనుకోవటం... అన్ని సంచలనాలే..| Rishi Kapoor's book 'Khullam Khulla' is full of revelations.

Rishi kapoor sensational comments on father raj kapoor

Rishi Kapoor, Khullam Khulla book, Rishi Kapoor autobiography, Rishi Kapoor Dawood relation, Rishi Kapoor Father, Raj Kapoor secrets, Khullam Khulla revelations, Rishi Kapoor Bobby, Rishi Kapoor Book, Rishi Kapoor relations, Rishi Kapoor Meena Iyer

Not only 'tea' with Dawood, Rishi Kapoor's book 'Khullam Khulla' is full of revelations. Rishi Kapoor admits buying award for 'Bobby' in his autobiography.

రిషికపూర్ పుసక్తంలో మొత్తం సంచలనాలు

Posted: 01/17/2017 08:28 AM IST
Rishi kapoor sensational comments on father raj kapoor

టాలీవుడ్ స్టార్ హీరో, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయిన జగపతి బాబు అప్పట్లో తన తండ్రి గురించి చేసిన కామెంట్లు బాగానే చర్చకు దారితీశాయి. తన తండ్రి ఓ ప్లే బాయ్ అని, ఆ అలవాట్లే తనకు అబ్బి ఇలా అయ్యానంటూ జగ్గూ ఓపెన్ గా స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఎంత తండ్రి అయినప్పటికీ, మరీ ఇంత ఓపెన్ గా ఓ లెజెండరీ మేకర్ గురించి కామెంట్లు చేయటం సరికాదని సీనియర్లు జగపతికి సూచించారు. ఆ సంగతి పక్కన పెడితే బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు రిషిక‌పూర్(64) త‌న‌ స్వీయ జీవిత చ‌రిత్ర ఖుల్లాం ఖుల్లా: రిషిక‌పూర్ అన్ సెన్సార్డ్ పేరుతో విడుద‌ల చేసిన పుస్త‌కంలో సంచ‌ల‌న విష‌యాలు వెల్లడించాడు.

ఈ పుస్తకంలో అతని వ్యక్తిగతమే కాదు, త‌న తండ్రి, బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అయిన రాజ్‌క‌పూర్ గురించి ఎవ‌రికీ తెలియ‌ని విష‌యాల‌ను అందులో పేర్కొన్నారు. సినిమాలు, హీరోయిన్లు, మ‌ద్యం తాగ‌డం.. ఇవే త‌న తండ్రి లోక‌మ‌ని, న‌ర్గీస్‌, వైజ‌యంతీమాల‌, త‌దిత‌ర హీరోయిన్ల‌తో త‌న తండ్రికి సంబంధాలు ఉండేవ‌ని అందులో పేర్కొన్నారు. అలాగే త‌న చిన్న‌నాటి అనుభ‌వాలు, త‌న కొచ్చిన పేరు ప్ర‌ఖ్యాతుల గురించి కూడా అందులో పేర్కొన్నారు. అంతేకాదు తన తండ్రిలా పిల్లలకు ఫ్రీడం ఇవ్వలేకపోతున్నానని తెగ ఫీలయ్యాడు. బాబీ సినిమాకు బెస్ట్ హీరోగా అవార్డును కొనుకోవటం దగ్గరి నుంచి, అది హిట్ అయ్యాకే తనకు కష్టాలు ప్రారంభమయ్యాయని, అవే తనని ఇంత స్థాయికి చేర్చాయని పేర్కొన్నాడు.

అలాగే భార‌త మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్ర‌హీంను తాను దుబాయ్‌లో రెండుసార్లు కలిశాన‌ని, అత‌డితో క‌లిసి టీ కూడా తాగాన‌ని పేర్కొన్నాడు. తొలిసారి 1988లో దుబాయ్‌లో ఆశా భోంస్లే నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వెళ్లిన త‌న వ‌ద్ద‌కు దావూద్ మ‌నిషి ఒక‌రు వ‌చ్చి దావూద్ ఇంటికి తీసుకెళ్లాడ‌ని రిషి క‌పూర్ పేర్కొన్నారు. అక్క‌డ త‌న‌ను దావూద్ సాద‌రంగా ఆహ్వానించాడ‌ని, తాను మద్యం తాగ‌న‌ని, అందుకే టీకి పిలిచాన‌ని దావూద్ త‌న‌తో చెప్పాడ‌ని రిషి పుస్త‌కంలో వివ‌రించారు.

Khullam Khulla

మ‌రోసారి 1989లో దుబాయ్‌లోనే ఓ లెబ‌నీస్ షాపులో బూట్లు కొనుక్కునేందుకు వెళ్లిన‌ప్పుడు అక్క‌డే ఉన్న దావూద్‌తో మ‌రోసారి క‌లిశాన‌ని వివ‌రించాడు. ఆయ‌న చేతిలో మొబైల్ ఫొన్‌, చుట్టూ ప‌దిమంది బాడీగార్డులు ఉన్నార‌ని పేర్కొన్నాడు. షాపులో త‌న‌కేం కావాలో తీసుకోమ‌ని చెప్పినా తాను తిర‌స్క‌రించాన‌ని రిషి తెలిపారు. భార‌త్‌లో ఎంతోమంది రాజకీయ నేత‌లు త‌న జేబులో ఉన్నార‌ని, వారికి చాలా డ‌బ్బు పంపించాన‌ని దావూద్ త‌న‌కు చెప్పాడ‌ని రిషిక‌పూర్ త‌న జీవిత చ‌రిత్ర‌లో వివ‌రించారు. ప్రముఖ రచయిత మీనా అయ్యర్ రచించిన అన్ సెన్సార్డ్ ట్యాగ్ లైన్ గల ఈ పుస్తకం మరిన్ని సంచనాలకు తావిస్తుందనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rishi Kapoor  autobiography  Khullam Khulla book  revelations  

Other Articles