ప్చ్.. కత్తి మిస్సయ్యింది! ఈసారి ఏం చేస్తాడో? | Dhanush, Ilayathalapathy Vijay, AR Murugadoss to team up.

Ilaya thalapathy to act in dhanush production

Dhanush, Vijay, Dhanush Vijay, Dhanush Murugadoss, Vijay Wunderbar Films, Ilaya Thalapathy Dhanush, AR Murugadoss next, Vijay 62 movie, Dhanush Vijay movie, Dhanush producing Vijay

Actor Dhanush to produce Vijay- AR Murugadoss Movie under his Wunderbar Films banner.

కోలీవుడ్ లో క్రేజీ కాంబోలో సినిమా

Posted: 01/11/2017 03:23 PM IST
Ilaya thalapathy to act in dhanush production

స్టార్ డైరక్టర్ మురగదాస్ ప్రస్తుతం మహేష్ 23వ చిత్రం పని పడుతున్నాడు. ఈ సినిమా తర్వాత మరో క్రేజీ ప్రాజెక్టు ఉండబోతుందని ఎప్పటి నుంచో అనౌన్స్ చేస్తున్నాడు. అయితే అది హీరో విజయ్ తోనేని ఈ మధ్యే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశాడు కూడా. ఇదిలా ఉంటే ఈ చిత్రం గురించి ఇప్పుడు మరో అప్ డేట్ అందింది.

ఓ ఆసక్తికర కాంబినేషన్ లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని సమాచారం. కోలీవుడ్ లో ధనుష్ తన వండర్ బార్ ఫిలిమ్స్ బేనర్ లో బయటి చిత్రాలు చేస్తుంటాడు కూడా. ఇక ఇప్పుడు విజయ్-మురగదాస్ చిత్రాన్ని తన బేనర్ లో నిర్మించేందుకు సిద్ధమైపోయాడు. దీంతో ఈ త్రిబుల్ ధమాకాపై హైప్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం మురగదాస్ ఫ్రీ కావటానికి మరో మూడు నెలల సమయం పడుతుంది. ఈ లోపు అట్లీ సినిమాను కూడా పూర్తి చేసే పనిలో పడ్డాడు విజయ్. అదయ్యాక ఈ హిట్ కాంబోలో సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది.

గతంలో విజయ్ హీరోగా తుపాకీ, కత్తి తెరకెక్కించాడు మురగదాస్. ఇక ఇప్పుడు మూడోసారి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమైపోయాడని అనుకుంటున్నారు కోలీవుడ్ జనాలు. నిజానికి ధనుష్ కత్తి సినిమాకు నిర్మాతగా వ్యవహరించాల్సి ఉండగా, అది లైకా వారు ఎగరేసుకుపోయారు. దీంతో ఈసారి ఎలాగైనా ఛాన్స్ మిస్సవ్వకూడదని ఫిక్స్ అయిపోయాడు ధనుష్. ఓవైపు హీరోగానే కాదు, నిర్మాతగా కూడా బాగానే వెనకేసుకుంటున్నాడు ఈ సూపర్ స్టార్ అల్లుడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dhanush  Vijay  62nd movie  Murugadoss  

Other Articles

Today on Telugu Wishesh