కేసీఆర్ కండిషన్ గుర్తుందా? | KCR condition to Balayya on Satakarni Special Show.

Kcr remind his condition to balayya

Telanagana CM KCR, Bala Krsihna, Satakarni Special Show, KCR troubles Balayya, KCR condition to Balayya, KCR remind his condition to Balayya, KCR wish to Balayya, Nagarjuna Satakarni special show, KCR Satakarni special show

Telangana CM KCR asks Bala Krishna to watch Satakarni special show with Chiranjeevi, Venkatesh and Nagarjuna.

కేసీఆర్ కోరిక బాలయ్య నెరవేరుస్తాడా?

Posted: 01/06/2017 03:17 PM IST
Kcr remind his condition to balayya

తన కెరీర్ మైలురాయిగా నిలవబోయే వందో చిత్రంగా శాతకర్ణిని ఎంచుకోవటమేకాదు, దానికి ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి సానుకూలతను పొంది టాక్స్ రాయితీ సంపాదించేసుకున్నాడు నటుడు బాలకృష్ణ. ఏపీలో ఉంది తమ ప్రభుత్వం, పైగా అక్కడ ముఖ్యమంత్రి తన వియ్యంకుడు కావటంతో పెద్ద సమస్య కాకపోయినా, తొలి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిని ఆకట్టుకోవటంలో మాత్రం బాగా సక్సెస్ అయ్యాడు. ఈ నేపథ్యంలో మళ్లీ కలిసి స్పెషల్ షోకి ఆహ్వానించటమే కాదు, టాక్స్ రాయితీకి కృతజ్నతలు కూడా తెలిపాడు.

అయితే ఇంత దాకా బాగానే ఉన్నా... కేసీఆర్ కోరిన ఓ కోరికతో మాత్రం బాలయ్యకు పెద్ద ఇబ్బందే వచ్చి పడింది. తాను సినిమాను టాలీవుడ్ లో అగ్రనటులైన చిరు, వెంకీ, నాగ్ లతో కలిసి చూడాలనుకుంటున్నానని తెలిపాడంట. నిజానికి సినిమా ఓపెనింగ్ రోజే కేసీఆర్ ఈ మాటను ప్రస్తావించాడు కూడా. ఇప్పుడు అదే విషయాన్ని బాలయ్యకు గుర్తు చేస్తూ, ఓపెనింగ్ డే రోజు వేదికపై ఉన్న వారంతా స్పెషల్ షోకు వస్తే బాగుంటుందని చెప్పినట్టు తెలిసింది.

దానికి స్పందించిన బాలయ్య, అందరినీ ఆహ్వానిస్తున్నానని, ఎవరు వస్తారో, ఎవరు రారో చెప్పలేనని పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా, శాతకర్ణికి ముందు రోజే ఖైదీ రిలీజ్ ఉంది. పోటాపోటీ అనుకుంటున్న సమయంలో బాలయ్య షోకి చిరు వస్తాడన్న దానిపై నమ్మకం లేదు. ఇక వెంకీ తరపు నుంచి ఎటువంటి అభ్యంతరాలు రాకపోవచ్చు. ఎటొచ్చి నాగ్ విషయంలో బాలయ్య ఏం చేస్తాడన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bala Krishna  KCR  Satakarni special screen  

Other Articles