రకుల్ ఫోటోతో కామాంధులకు సందేశం | Rakul's pic message on Bengaluru molestation.

Rakul pic on bengaluru molestation has gone viral

actress Rakul Preet Singh, Bangalore Molestation, rakul on molestation, celebs on Bangalore molestation, Rakul Molestation pic, Rakul message on molestation, Rakul's pic message viral

Bengaluru molestation actress Rakul Preet Singh condemns incident.

లైంగిక వేధింపులపై రకుల్ ట్వీట్

Posted: 01/06/2017 12:34 PM IST
Rakul pic on bengaluru molestation has gone viral

మహిళలంటే ఓ వస్తువు కాదంటూ నినాదాలు కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా జరిగిన ఘటనల నేపథ్యంలో వినిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతోపాటు హైటెక్ నగరాలుగా విరజిల్లుతున్న బెంగళూర్, పుణే, హైదరాబాద్ ఇలా దాదాపు అన్ని ప్రాంతాల్లో యువతులపై అసభ్య ప్రవర్తన గురించి ఉదంతాలు ఒక్కోక్కటిగా వెలుగుచూస్తున్నాయి. బద్మాష్ లు చేసిన ఆ పాడుపనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తటమే కాదు, ఆ కామాంధులను నిర్దాక్షిణ్యంగా శిక్షించాలంటూ విజ్నప్తులు వినవస్తున్నాయి.

బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ తో మొదలై అక్షయ్ కుమార్ తో సహా పలువురు స్టార్ హీరోలు, సీరియల్ సెలబ్రిటీలు ఘటనలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. 70 ఏళ్ల స్వాతంత్ర్య భారతావని చిత్రాన్ని రకుల్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ఈ సందర్భంగా 'ఈ మనస్తత్వాలు ఎప్పుడు మారుతాయి?' అంటూ ప్రశ్నించింది. ఏదో ఒకరోజున కచ్చితంగా ఆడవాళ్లను వస్తువుగా చూడడం అనేదానిని మానేస్తారని ఆకాంక్షించింది.  రేప్ బాధితుల కోసం రకుల్...

కాగా, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కాస్మోపాలిటన్ నగరాలు యువతులను సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా లైంగికంగా వేధించిన సంగతి తెలిసిందే. కురచగా ఉన్నది అమ్మాయిల దుస్తులు కాదు.. మృగాళ్ల మనస్తత్వమే కురచగా ఉందంటూ తీవ్రస్థాయిలో ఫైరయ్యాడు యాక్షన్ హీరో అక్షయ్ కుమార్. మార్షల్ ఆర్ట్స్‌లో యువతులు ఆరి తేరాలంటూ పిలుపు కూడా ఇచ్చాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Rakul Preet Singh  Pic Message  Bangalore Molestation  

Other Articles