గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న దర్శకరత్న దాసరి నారాయణరావు క్రేజీ అనౌన్స్ మెంట్ తో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అమ్మ జయలలిత జీవితంపై బయోపిక్ తీసేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారన్న వార్త గత రెండు మూడు రోజులుగా వార్తల్లో హల్ చల్ చేస్తోంది. ఆ వార్త నిజమేనని స్వయంగా ఆయనే ప్రకటించారు. అంతేకాదు ప్రస్తుతం కథ రాసే పనిలో ఉన్నానని చెప్పిన ఆయన లీడ్ రోల్(రమ్యకృష్ణ, త్రిష పేర్లు పరిశీలనలో ఉన్నట్లు టాక్) ఎవరిదో చెప్పకుండా కొత్త వాళ్లతో కేవలం నెల రోజుల్లో సినిమా తెరకెక్కిస్తానని షాక్ ఇచ్చారు.
ఇక ఖైదీ నంబర్ 150 ప్రీరిలీజ్ వేడుకకు మరో దిగ్గజం రాఘవేంద్రరావుతో కలిసి హాజరవుతానని చెప్పేశాడు. గతంలో చిరంజీవి కెరీర్ లో విజయవంతమైన సినిమాలన్నింటికీ తానే ముఖ్య అతిథిగా హాజరయ్యానని, చిరు ఫంక్షన్ అంటే తనకు సొంత ఫంక్షన్ అని ఆయన తెలిపాడు. తనకు అవసరమైన స్టార్ డమ్ చిరు ఇప్పటికే సంపాదించేశాడని, అయితే ఆ క్రేజ్ ఉందా? లేదా? అని చెప్పడానికి ఈ సినిమా పునాది అవుతుందని తెలిపాడు. ఇక ఖైదీ కోసం చిరు కష్టం గురించి కెరీర్ తొలినాళ్లలో ఎంత కష్టపడ్డాడో ఇప్పుడు కూడా అంతే కష్టపడ్డాడని తెలిపాడు.
తన 50 ఏళ్ల కెరీర్ లో హీరోలందరినీ చూస్తూ వచ్చానని, ఒకవేళ వారిని తానేదైనా అన్నా వారు సీరియస్ గా తీసుకోరని ఆయన తెలిపారు. టాలీవుడ్ లో సంక్రాంతికి 3 పెద్ద సినిమాలను భరించగల శక్తి ఉంటుందని ఆయన అన్నారు. తొలి రోజు ఏ హీరో ఫ్యాన్స్ ఆ హీరో సినిమా చూస్తారని, రెండో రోజు ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కలిసి ఒక సినిమా చూస్తారని ఆయన అన్నారు. అలాంటిది రెండు పెద్ద సినిమాలన్నది పెద్ద సమస్య కాదని.. 'ఖైదీ నెంబర్ 150', 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాలు ఒకేసారి విడుదలవడంపై ఆయన వ్యాఖ్యానించారు. రెండూ వేటికవే వైవిధ్యమైన కథాంశం గల సినిమాలని ఆయన చెప్పారు. అందుకే తెలుగు సినీ ప్రేక్షకులు ఈ రెండు సినిమాలను ఆదరిస్తారని ఆయన తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more