రోహిత్ చిరాకు పడటం వల్లే అప్పట్లో... సక్సెస్ ! | Nara Rohit frustrated with Appatlo Okadundevadu story.

Nara rohit confidence on sree vishnu character in appatlo okadundevadu

Sree Vishnu, Nara Rohit, Appatlo Okadundevadu, Appatlo Okadundevadu behind scene, Appatlo Okadundevadu Movie, Appatlo Okadundevadu success meet, Sree Vishnu about Nara Rohit, Sree Vishnu about Appatlo Okadundevadu, Appatlo Okadundevadu interview, Appatlo Okadundevadu producer Nara Rohit, Nara Rohit frustrated

Sree Vishnu about Appatlo Okadundevadu success and Interesting things about Nara Rohit.

రైల్వే రాజుపై రోహిత్ కాన్ఫిడెన్స్ ఫలించింది

Posted: 01/04/2017 04:03 PM IST
Nara rohit confidence on sree vishnu character in appatlo okadundevadu

టాలీవుడ్ తో ఒక యేడాదికి సరిగ్గా ఎలాంటి ముగింపు పలకాలో అలాంటి హిట్ అప్పట్లో ఒకడుండేవాడుతో దొరికింది. నారా రోహిత్, శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో 90వ దశకంలో జరిగిన నిజ సంఘటనలతో ఈ చిత్రం తెరకెక్కి హిట్ టాక్ సంపాదించుకుంది. ప్రస్తుతం ప్రేక్షకుల ఆదరణ అంతా ఈ సినిమాపైనే... అయితే కథ రాసింది మూడు నెలలోనే అయినప్పటికీ దీనిని స్క్రిప్ట్ గా మార్చి తెరకెక్కించడానికి మూడేళ్లపైగానే పట్టిందని తెర వెనుక కష్టం చెబుతున్నాడు నటుడు శ్రీ విష్ణు.

అయితే నారా రోహిత్ చిరాకు పడటం వల్లే 'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమా రూపొందిందని ఈ సినిమాలో రైల్వే రాజుగా నటించి ఆకట్టుకున్న శ్రీ విష్ణు తెలిపాడు. కాదల్ ప్యార్ ఇష్క్ సినిమాతో ఆరంగ్రేటం చేసి ప్రతినిధి, 'సన్నాఫ్ సత్యమూర్తి'లో చిన్న పాత్రలు చేసిన శ్రీ విష్ణు అప్పట్లో .. సినిమాలో రైల్వే రాజుగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

ఈ స్క్రిప్టు పట్టుకుని దర్శకుడు సాగర్(అయ్యారే ఫేం) తో కలిసి ఫిల్మ్ నగర్, మణికొండలోని సినీ నిర్మాణ సంస్థల ఆఫీసుల వెంటపడ్డామని చెప్పాడు. ఎవరూ అవకాశం ఇవ్వలేదని చెప్పాడు. ఈ విషయం తెలిసిన తన స్నేహితుడు నారా రోహిత్ చిరాకుపడ్డాడని, 'ఇంక ఈ తిరుగుళ్లు ఆపండి' అని చెప్పి, సొంతంగా సినిమా నిర్మిద్దామని చెప్పాడని శ్రీ విష్ణు గుర్తుచేసుకున్నాడు. 

అప్పట్లో ఒకడుండేవాడు నిర్మాణాన్నంతా నాకే అప్పగించాడు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడంలో కృష్ణ విజయ్ - ప్రశాంతికి బాగా సహకరించారు. డిఫరెంట్ గా తయారు చేసుకున్న మా స్క్రిప్ట్ పై నాకు నమ్మకముంది. బహుబలి సమయంలో తన జడ్జిమెంట్ ఫలించటంతో రోహిత్ కు నమ్మకం ఏర్పడిందని, అది వమ్ము కాకుండా రోహిత్ కు మంచి విజయం రావడం ఆనందంగా ఉందని శ్రీ విష్ణు చెప్పాడు. కాగా 'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమా నారా రోహిత్ సొంత బ్యానర్ పై రూపొందటమే కాదు, కలెక్షన్లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఓవైపు విష్ణుకి ఆఫర్లు క్యూ కట్టడంతోపాటు, దర్శకుడు సాగర్ కి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh