అఫైర్ పై ఖండించిందా? క్లారిటీ ఇచ్చిందా? | Shraddha Kapoor serious on Farhan Akhtar affair.

Shraddha kapoor finally breaks silence on affair

Shraddha Kapoor, Farhan Akhtar, Shraddha Kapoor on affair, Shraddha about living relationship, Shraddha Kapoor Farhan Akhtar, Farhan Akhtar on Sharaddha Kapoor affair, Farhan Akhtar new affair

Actress Shraddha Kapoor respond on Farhan Akhtar's alleged affair and living relationship it's not true.

అఫైర్ పై శ్రద్ధ కపూర్ ఏం చెప్పిందంటే...

Posted: 01/03/2017 12:21 PM IST
Shraddha kapoor finally breaks silence on affair

రూమర్ ను ఎటూ తేల్చకుండా నాన్చటం, ఆపై తారాస్థాయికి చేరగానే మీడియా ముందుకు చేరి గగ్గోలు పెట్టడం స్టార్లకు చాలా అలవాటైన పనే. బాలీవుడ్ నటి శ్రద్ధకపూర్ కూడా ఇప్పుడు అదే పనిచేస్తోంది. నటుడు ఫర్హాన్ అక్తర్ తో సహజీవనం గురించి కథనాలు తనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయని చెబుతూ, పుకార్లు రేపిన మీడియాపై మండిపడుతోంది.

ఈ మధ్య ఓ వార్త చదివాను. తామూ మనుషులమే అన్న సంగతిని గుర్తించనంతవరకు ఇలాంటి రూమర్లు వస్తూనే ఉంటాయని తెలిపింది. సినీ నటులుగా ఉన్న తమలాంటి వారిపై గాసిప్స్ చదవడానికి సామాన్య జనం ఆసక్తి చూపిస్తారు. కానీ, ఇలాంటి కథనాలు తన తండ్రిని, ఆంటీని, తన సహనటుడిని జోడించడం సరికాదని వ్యాఖ్యానించినట్టుగా "బొంబాయి టైమ్స్ ' రిపోర్టు చేసింది.

కాగా, ఫర్హాన్-శ్రద్ధా పీకల్లోతు ప్రేమలో ముగినిపోయారనీ, ఆ క్రమంలో విడాకులు, ఆపై ఇద్దరూ సహజీవనం చేస్తున్నారని బీ టౌన్ గుప్పుమంది. ఈక్రమంలో వీరిద్దరి వ్యవహారం నచ్చని ఆమె తండ్రి (శక్తి కపూర్) ఫర్హాన్ అపార్ట్మెంట్ నుంచి శ్రద్ధాను బలవంతంగా బయటకి లాకొచ్చిన్నట్టుగా కథనాలు వచ్చాయి. అయితే ఇవి పూర్తిగా నిరాధారమైనవిగా సీనియర్ కపూర్ ఖండించారు. ఇక ఇపుడు నేరుగా శ్రద్ధా కూడా స్పందించడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Farhan Akhtar  Shraddha Kapoor  Affair  

Other Articles

Today on Telugu Wishesh