విశాల్ సారీ చెబితే వదిలేస్తారంట! | Producers Council condition for Hero Vishal.

High court notices to hero vishal

Hero Vishal, Tamil Nadu Producers Council, Madras High Court, Legal Notice to Vishal, Vishal Sorry, Hero Vishal suspended, Vishal TFPC, Producers Council Vishal

Producers Council to Madras HC they will revoke Vishal’s suspension if he apologises to them. Vishal was temporarily suspended in November for criticising the functioning of TFPC’s office bearers.

విశాల్ పై వేటు ఎత్తేస్తాం, కానీ...

Posted: 01/03/2017 11:16 AM IST
High court notices to hero vishal

నిత్యం వివాదాలతో నిలుస్తున్న నటుడు విశాల్ పై నిర్మాతల మండలి కొంత కాలం క్రితం ఓ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. బోండాలు తింటూ టైంపాస్ చేస్తున్నారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేయటంతో వారంతా విశాల్ పై సీరియస్ అయ్యారు. అంతేకాదు పైరసీ, శాటిలైట్ రైట్స్ విషయంలో వాళ్లు చేష్టలూడి చూస్తూ ఉన్నారని, నిస్వార్థపరులైన వ్యక్తులు నిర్మాతల మండలిలో ఉండాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యలు చేశాడు. దీంతో అతని విశాల్ ఫిల్మ్ ఫాక్టరీపై నిషేదం విధిస్తూ ఆదేశాలు విధించింది ప్రొడ్యూసర్ కౌన్సిల్.

నిర్మాతల మండలి కార్యవర్గం విశాల్‌ నుంచి వివరణ కోరుతూ లేఖ రాసింది. అయితే ఇచ్చిన వివరణ సంతృప్తి కలిగించకపోవడంతో అతడిపై తాత్కాలికంగా వేటు వేస్తూ తీర్మానం చేశారు. దీంతో విశాల్‌ చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. తాను 2013 నుంచి చిత్ర నిర్మాణంలో ఉన్నానని, తనపై అసత్య ఆరోపణలు చేస్తూ, దురుద్దేశంతో నిర్మాతల మండలి నిర్వాహకులు చట్ట వ్యతిరేకంగా తాత్కాలిక నిషేధం విధించారని అతడు తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. తనపై విధించిన నిషేధాన్ని తొలగించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరాడు. హీరో విశాల్‌కు రిట్‌ పిటీషన్‌ దాఖలు చేయాల్సిందిగా మద్రాస్‌ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఈ కేసు సోమవారం న్యాయమూర్తి కల్యాణ సుందరం సమక్షంలో విచారణకు వచ్చింది. నిర్మాతల మండలి తరఫున హాజరైన న్యాయమూర్తి వాదిస్తూ ఈ కేసులో విశాల్‌ తన విచారాన్ని వ్యక్తం చేస్తే అతడిపై నిషేధాన్ని రద్దు చేయడానికి సిద్ధమని తెలిపారు. దీంతో విశాల్‌ తరఫున బదులివ్వాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. తదుపరి విచారణను వాయిదా వేశారు.

కాగా, ఫిబ్రరి 5న జరగబోయే నిర్మాతల మండలి ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవికి నటి కుష్బూ పోటీ చేయనున్నట్లు విశాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కుష్బూ మాత్రం తన ఇష్టప్రకారంగానే పోటీ చేస్తున్నానని, తనపై ఎవరి ఒత్తిడి లేదని చెప్పటం కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hero Vishal  Tamil Nadu Producers Council  Madras High Court  

Other Articles