విక్రమ్ ఇచ్చిన షాక్ కి కోలుకోలేకపోయాడంట! | Prabhu sweet shock on his 60th birthday.

Vikram prabhu big surprise to his father

Actor Prabhu, Rajinikanth, Kamal Haasan, Rajani Kamal Prabhu, Prabhu suprise, Prabhu Son Vikram, Prabhu’s 60th birthday, Rajini and Kamal, Prabhu special birthday, rabhu birthday celebrations, Prabhu with Family, Prabhu son, Vikram Prabhu with father, sivaji ganesan son, Kollywood Actor Prabhu

Rajinikanth and Kamal Haasan attend Prabhu’s 60th birthday celebration.

రజనీ, కమల్ కామన్ గా షాకిచ్చారు

Posted: 12/29/2016 11:17 AM IST
Vikram prabhu big surprise to his father

సౌత్ టాప్ హీరోలైన రజనీకాంత్, కమల్ హసన్ తమ తర్వాతి తరం హీరోలకు ఆదర్శంగా నిలుస్తూ వస్తుండటం చూస్తున్నాం. కోలీవుడ్ కు సంబంధించిన ఏ ఈవెంట్ అయినా, ఎంత చిన్నహీరో పంక్షన్ అయినా హాజరై ఆశీర్వదించటం వీళ్లకు ముందు నుంచి అలవాటే. అలాంటిది లెజెండరీ యాక్టర్ ఫ్యామిలీ నుంచి పిలుపు వస్తే ఊరుకుంటారా? అయితే వెళ్లింది పుట్టినరోజు సర్ ప్రైజ్ కోసం లేండి.

నడిగర్ తిలకం శివాజీ గణేషన్ తనయుడు, సీనియర్ నటుడు ప్రభు ఆదివారం తన 60వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా తన తండ్రికి గుర్తుండిపోయే గిప్ట్ ఇవ్వాలని ప్రభు కొడుకు, హీరో విక్రమ్ ప్రభు ఆలోచన చేశాడు. అనుకున్నదే తడవుగా రజనీ, కమల్ లకు ఫోన్ చేసి ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. అంతే అనుకున్నదే తడవుగా వారిద్దరూ ప్రభు ఇంటికి వెళ్లి సర్ ప్రైజ్ ఇచ్చారు.

ముందుగా వెళ్లిన రజనీ విష్ చేసి ఓ అరగంట గడిపి వెళ్లిపోగా, తర్వాత వెళ్లిన కమల్ ఏకంగా ప్రభు ఫ్యామిలీతో లంచ్ చేశాడు. ఇక ఇద్దరూ స్టార్ హీరోలు ఒకేసారి తన ఇంటికి వచ్చి తనకు బర్త్ డే విషెస్ తెలియజేయటంతో ప్రభు ఉబ్బితబ్బిబి అయిపోయి కొడుకును ఆలింగనం చేసేసుకున్నాడంట. 1982లో సంగలి చిత్రం ద్వారా కోలీవుడ్ కు పరిచయం అయిన ప్రభు అడపా దడపా తెలుగు చిత్రాల్లోనూ నటిస్తున్నాడు కూడా. ఇక తనయుడు విక్రమ్ ప్రభు ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. 

Rajini Kamal Prabhu

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Prabhu  60th Birthday  Kamal Hassan  rajinikanth  Vikram Prabhu  

Other Articles