దంగల్ వర్సెస్ సుల్తాన్.. సల్మాన్ ఓడిపోయాడా? | Salman Khan admits Dangal victory.

Sultan hates aamir khan professionally

Salman Khan, Salman Khan Aamir Khan, Salman tweets Aamir Khan, Salman Khan Dangal, Salman Khan Dangal victory, Sultan versus Dangal, Dangal Sultan, Salman tweets on Dangal, Salman hates Aamir, Salman Aamir professional rival vary, Salman Khan Sultan records Dangal

Salman Khan admits Aamir Khan's victory tweets Dangal better than Sultan.

అమీర్ దంగల్ పై సల్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Posted: 12/23/2016 01:00 PM IST
Sultan hates aamir khan professionally

బాలీవుడ్ లో అమీర్ ఖాన్ దంగల్ రికార్డుల ప్రభంజనం మొదలైంది. సెలబ్రిటీల రివ్యూలకు తోడు, ఈ రోజు ఉదయం నుంచి బెనిఫిట్ షోలు, ఓవర్సీస్ రివ్యూలతో అమీర్ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. రియల్ రెజ్లర్ మహవీర్ సింగ్ తన కూతుళ్లను మల్ల యోధురాల్లుగా ఎలా తీర్చిదిద్దాడు అన్న కథాంశంతో తెరకెక్కిన ఈ బయోపిక్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే బయోపిక్ కాకపోయినప్పటికీ ఒకరకంగా సేమ్ కంటెంట్ తో తెరకెక్కి అల్రెడీ బ్లాక్ బస్టర్ అయిన ఓ చిత్రం తో కంపేరిజన్ చేస్తున్నారు. 

ఈ యేడాదే సల్మాన్ నటించిన సుల్తాన్ ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. సుల్తాన్ అలీఖాన్ అనే ఒలింపిక్ రెజ్లర్ పాత్రను క్రియేట్ చేసి ఓ కల్పిత కథతో 'సుల్తాన్' తెరకెక్కింది. సల్మాన్ ఫెర్ ఫార్మెన్స్ కు ఫిదా అయి పోయిన జనాలు చిత్రాన్ని బ్లాక్ బస్టర్ చేసి కలెక్షన్ల రికార్డుల జాబితాలో నిలబెట్టేశారు. ఇంచుమించు సేమ్ కంటెంట్.. పైగా రెండు జాట్ (హర్యానా) మల్లయోధుల జీవిత గాథ కావటం విశేషం. దీంతో దంగల్ ఎలా ఉండబోతుందా అన్న ఆసక్తి నెలకొంది.

ఈ నేపథ్యంలో స్వయంగ సల్మాన్ దంగల్ గురించి ట్వీటాడు. "నా కుటుంబం 'దంగల్‌' చిత్రాన్ని చూసింది. ఇది 'సుల్తాన్‌'తో పోలిస్తే బాగున్న చిత్రం. నిన్ను వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నా, అయితే, వృత్తిపరంగా మాత్రం ద్వేషిస్తున్నా" అంటూ సల్మాన్‌ ఖాన్, అమీర్ ఖాన్ ను ఉద్దేశించి చేసిన ట్వీట్‌ తెగ వైరల్ అయింది. నిన్న సాయంత్రం సల్మాన్ కుటుంబం ఈ చిత్రాన్ని చూడగా, అర్ధరాత్రి 1:37 గంటల సమయంలో ఈ ట్వీట్ ను కండల వీరుడు వదిలాడు. అయితే రికార్డు కలెక్షన్లు రాబట్టిన సుల్తాన్ ను ఈ డీమానిటైజేషన్ పరిస్థితుల్లో అమీర్ దంగల్ బ్రేక్ చేయగలదా? అన్నదే ఇప్పుడు అసలు చర్చగా మారింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aamir Khan Dangal Movie  Salman Khan Sultan Movie  

Other Articles