అమీర్ దంగల్.. మరి తమ్ముడేమో .... | Faisal Khan's Danger First look poster out.

Danger movie first look released

Faissal Khan Danger, danger movie first look, Aamir khan brother Danger Movie, Scariest first look of bollywood, Danger movie real incidents, Danger movie actress, danger direvtor, Danger movie posters, Danger Bollywood movie, Faisal Saif movies, Aamir Khan brother Faissal Khan

Most Scariest First look poster of Bollywood movie Danger released.

అమీర్ సోదరుడి సినిమా ఫస్ట్ లుక్

Posted: 12/21/2016 05:43 PM IST
Danger movie first look released

ఇక్కడ మీరు చూస్తున్నది ఓ బాలీవుడ్ సినిమా ఫస్ట్ లుక్. పేరు డేంజర్ పోస్టర్ కూడా అదే స్థాయిలో ఉంది కదా. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కి స్వయానా సోదరుడైనా ఫైజల్ ఖాన్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ గురించి ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ డిస్కషన్ నడుస్తోంది.

గతంలో పాంచ్ గంటే మే పాంచ్ క్రోర్, మై హూ రజనీకాంత్ వంటి చిత్రాలను తెరకెక్కించి వివాదాల్లో నిలిచిన దర్శకుడు ఫైజల్ సైఫ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బీహార్ లోని గయలో జరిగిన వాస్తవిక ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించాడు. ఓ హోటల్ వచ్చే కస్టమర్లను చంపి, నరమాంసాన్ని వేరే వాళ్లకి వడ్డించటం, అక్కడకు తన భార్యతో వచ్చిన ఓ స్టాక్ బ్రోకర్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కుంటాడు అన్న కథాంశంతో ఈ చిత్రం ఉండబోతుందంట.

బాలీవుడ్ లో ఇదే భయానక చిత్రం అని చెప్పుకుంటున్నాడు దర్శకుడు పైజల్ సైఫ్. ఫైజల్ ఖాన్ లోని కొత్త యాంగిల్ ను ఇందులో చూడబోతున్నారని చెబుతున్నాడు. ప్రస్తుతం కర్ణాటకలోకి కూర్గ్ ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగష్టు 3న హీరో ఫైజల్ బర్త్ డే సందర్భంగా విడుదల చేయనున్నారంట. వేదిత ప్రతాప్ సింగ్, వివాదాస్పద నటి కవితా రాధేశ్యామ్, తెలుగువారికి బాగా సుపరిచితురాలైన సోనీ చరిష్థా ఇందులో లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.

Faisal Danger firstlook

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Danger Movie  Scariest first look  Faissal Khan  Faisal Saif  

Other Articles

Today on Telugu Wishesh