గురు టీజర్:కల్లు కాంపౌండ్ లో వెంకీ ఊర స్టెప్పులు | Victory Venkatesh Guru teaser.

Venkatesh guru teaser out

Victory Venkatesh, Venky Guru Birthday, Guru Birthday teaser, Venky Birthday teaser, Guru telugu movie teaser, Victory Venkatesh Guru teaser, Venky Guru Teaser, Venky's Guru, Guru Movie teaser, Guru Movie 2017

Victory Venkatesh Guru movie Teaser released by Rana on Venky's Birthday.

వెంకీ గురు బర్త్ డే టీజర్ రిలీజ్

Posted: 12/13/2016 11:17 AM IST
Venkatesh guru teaser out

విక్టరీని తన ఇంటి పేరుగా మార్చేసుకున్న దగ్గుబాటి వారుసుడు వెంకటేష్ పుట్టినరోజు ఇవాళ. ఈ సందర్భంగా అప్ కమింగ్ మూవీ గురు టీజర్ ను వదిలాడు అబ్బాయి రానా. నిన్న సాయంత్రం బాబాయ్ కి బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టర్ వదిలిన భల్లాళదేవుడు కాసేపటి క్రితం టీజర్ నూ రిలీజ్ చేశాడు. హ్యాపీబర్త్ డే విక్టరీ వెంకటేష్ అంటూ అందులో పేర్కొన్నాడు.

 

ఇక 40 సెకన్ల టీజర్ లో మన క్లాసిక్ మ్యూజిక్ కి వెంకీ మాస్ స్టెప్పులేశాడు. చిటికెలేస్తూ కల్లు కాంపౌండ్ లో చిత్తుగా తాగి ఊగిపోతూ ఉన్న గురు టీజర్ ఇంట్రస్టింగ్ గా ఉంది. కబాలి ఫేం సంతోష్ నారాయణన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. లుక్కు పరంగా వెంకీ గడ్డంతో రఫ్ లుక్ తో ఫిట్ గా కనిపిస్తున్నాడు. మాతృక సాలా కడ్డూస్ కి దర్శకత్వం వహించిన సుధ కొంగర ‘గురు’ కి దర్శకత్వం వహిస్తుండగా, అక్కడ హీరోయిన్ గా చేసిన రితికానే ఇందులోనూ నటిస్తోంది.

ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ కునాల్‌ గిర్‌ ట్రైనింగ్ లో కండల వీరుడిగా మారాడు వెంకీ. గతంలో రానాకి ట్రైనర్ గా పని చేసిన గిర్ ఇప్పుడు వెంకీకి కూడా పని చేయటం విశేషం. ఇక ‘బాబు బంగారం’తో ఈ ఏడాది ఫ్యాన్స్ ను పలకరించిన ఆయన.. మేనల్లుడు నాగచైతన్య ‘ప్రేమమ్‌’లో గెస్ట్ రోల్ లో తళుక్కుమన్నాడు. జనవరి 26న రిలీజ్ కానున్న గురుతో వెంకీ సోలో హిట్ కొట్టాలని కోరుకుంటూ తెలుగు విశేష్ తరపున హ్యాపీ బర్త్ డే టూ వెంకీ.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Victory Venkatesh Birthday  Rana Guru Teaser  

Other Articles