ఖైదీ టీజర్ లో అది చూపించరా? | Surprising elements in khaidi No 150 teaser.

Megastar 150th movie teaser release today

Mega Star treat, Khaidi teaser, Kahaidi official teaser, Khaidi no 150, Khaidi no 150 teaser, Khaidi official teaser, Khaidi No 150 teaser, Chiru 150 teaser, Chiru Khaidi no 150 teaser, Chiru Movie official teaser, Khaidi No 150 official teaser

am Charan release Megastar 150th Movie Khaidi No 150 teaser today.

మెగా టీజర్ పై అంతా టెన్షన్.. టెన్షన్...

Posted: 12/08/2016 03:18 PM IST
Megastar 150th movie teaser release today

మెగాస్టార్ 150వ చిత్ర టీజర్ కి సర్వం సిద్ధం అయిపోయింది. ఈ రోజు సాయంత్రం చిత్ర నిర్మాత రాంచరణ్ ఈ చిత్రం టీజర్ ను విడుదల చేసి, రేపటి నుంచి తన సినిమా ధ్రువ షోలలో ప్రదర్శించేందుకు సిద్ధమైపోతున్నాడు. ఇప్పటికే ఖైదీ నంబర్ 150 ఫస్ట్ లుక్ కు విపరీతమైన రెస్పాన్స్ రాగా, ఆ తర్వాత విడుదల చేసిన పోస్టర్ లలో చిరు లుక్కు కిక్కేచ్చింది.

ఇంకా ఒక్క రోజు షూటింగ్ మిగిలి ఉందని చెప్పిన చెర్రీ క్రిస్మస్ కి ఆడియో విడుదల చేస్తున్నట్లు చెప్పేశాడు. 25వ తేదీ సాయంత్రం విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో ఆడియో వేడుక జరిగే అవకాశం ఉంది. ఇక రిలీజ్ డేట్ విషయంలో కూడా చెర్రీ ఓ ప్రకటన చేశాడు. ముందుగా అనుకున్నట్లు భోగి రోజున (13న)కాకుండా, 11 లేదా 12 వ తేదీల్లోనే రిలీజ్ చేసేందుకు రెడీ అయిపోతున్నాడు.

 

ఒకవేళ బాలయ్య శాతకర్ణి 12 న వస్తే చిరు 11నే దిగుతాడన్నమాట. ఆడియో పంక్షన్ లో నే రిలీజ్ పై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అందరి కళ్లన్నీ సాయంత్రం 6 ఎప్పుడు అవుతుందా? అని, మాస్ దర్శకుడు వినాయక్ చిరును ఎలా చూపించబోతున్నాడా? అని ఎదురు చూస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  150th movie  Khaidi No 150 teaser  

Other Articles