జయ కోసం సిగరెట్ కాల్చి రివెంజ్ తీర్చుకున్న రజనీ | rajanikanth smoke cigar in public place.

Rajanikanth revenge on jayalalitha

Rajinikanth, Jayalalitha, Rajinikanth Jayalalitha, Rajinikanth Jayalalitha revenge, rajanikanth struck jayalalitha with cigar, Rajinikanth Jayalalitha untold story, Rajinikanth Jayalalitha news, Rajinikanth condolence Jayalalitha

Rajinikanth Once Got Jayalalitha Stuck In A Traffic Jam As A Revenge.

సిగరెట్ తో ఆమెను ఆపేశాడా?

Posted: 12/06/2016 01:29 PM IST
Rajanikanth revenge on jayalalitha

నో డౌట్... తమిళనాట తలైవా రజనీకాంత్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాములుగా ఉండదన్న విషయం అందరికీ తెలిసిందే. అంతటి ఇమేజ్ ఉండి కూడా చాలా తెలివిగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు సూపర్ స్టార్. జనాల్లో దేవుడిగా పూజలు అందుకున్నప్పటికీ దివంగత జయలలితతో పోలిస్తే మాత్రం ఆ అభిమానుల సంఖ్య ఆయనకు చాలా తక్కువే. అయినప్పటికీ తన క్రేజ్ తో సీఎంగా ఉన్న జయలలితను ఎలా ఇబ్బంది పెట్టాడో ఓ ఘటన ఆ మధ్య బయటకు వచ్చింది.

ఒక రోజు జయలలిత కాన్వాయ్ వెళ్తున్న రూట్ లో రజనీ కూడా ప్రయాణిస్తున్నాడంట. ట్రాఫిక్ ఎంతకీ ముందుకు కదలకపోవటంతో ఏం జరిగిందని రజనీకాంత్ ఆరా తీశాడంట. అదే రూట్ లో జయలలిత వస్తున్నారని, అందుకే ఆపేశామని ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ చెప్పాడంట. ఆలస్యం అవుతుండటంతో అసలు ఆమె ఎంత సేపట్లో వస్తారని అడిగేసరికి కానిస్టేబుల్ దగ్గరి నుంచి సమాధానం లేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన రజనీ కారు దిగి పక్కనే ఉన్న ఓ చిన్న కొట్టు దగ్గరికి వెళ్లి సిగరెట్ తాగటం ప్రారంభించాడంట.

అంతే రజనీ కాంత్ కోసం సిటీ మొత్తం అక్కడికి చేరిపోయింది. ఆపై ఏం జరిగివుంటుందో మీకు అర్థమైపోయి ఉంటుంది. అదేనండీ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి ఆఖరికి జయ కాన్వాయ్ కూడా అందులో చిక్కుకుపోయింది. రజనీని కన్విన్స్ చేసి మొత్తం ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి రమారమీ గంటన్నర సమయమే పట్టిందంట పోలీసులకు. కావాలనే రజనీ ఇలా ప్రతీకారం తీర్చుకున్నాడంటూ అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. 

నిజానికి మొదటి నుంచి జయలలిత, రజనీకాంత్ కి కొంత కాలం గొడవలు, కొంత కాలం స్నేహం ఇలా సాగుతూ వస్తోంది. గాయత్రీ శ్రీకాంత అనే నేత్ర వైద్య నిపుణురాలు ‘ద నేమ్‌ ఈజ్‌ రజనీకాంత్’ అనే పేరుతో రజనీ పై రాసిన పుస్తకంలో పేర్కొంది. జయలలిత చనిపోయిన తర్వాత రజనీకాంత్ పరామర్శకు వెళ్లటమే కాదు, చెలికత్తె అయిన శశికళను పట్టుకుని మరీ ఓదార్చటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajanikanth  Jayalalithaa  Cigar revenge  

Other Articles