వర్మ అన్ని కండిషన్లకు ఒప్పేసుకున్నాడా? | Controversial song cut from the movie Vangaveeti.

High court clearance for vangaveeti

Vangaveeti, Vangaveeti High Court, Vangaveeti censor, Vangaveeti RGV, Varma Vangaveeti, Vangaveeti telugu movie, Vangaveeti movie, Vangaveeti song remove, Vangaveeti controversy, Vangaveeti news, Vangaveeti scenes deleted, Vangaveeti Controversial song and scenes, Vangaveeti

After Hyderabad HC notice, Controversial song and scenes removed from film Vangaveeti.

వంగవీటి వార్ ఇక సెన్సార్ బోర్డుతోనే...

Posted: 12/03/2016 08:44 AM IST
High court clearance for vangaveeti

వర్మ వంగవీటి సినిమాపై నెలకొన్న పంచాయితీ కోర్టు నుంచి సెన్సార్ బోర్డుకు చేరింది. ఈ సినిమాలో వంగవీటి చరిత్రను వక్రీకరించారంటూ రంగ వారసుడు రాధా పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం విచారణ జరగ్గా, కోర్టు సెన్సార్ బోర్డును ఆశ్రయించాలని పిటిషనర్ కు సూచించింది.

కాపు, కమ్మ అంటూ సాగే వంగవీటి టైటిల్ సాంగ్ తోపాటు, కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో వాటిని తొలగించేందుకు చిత్ర నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ అంగీకరించాడు. వీటితోపాటు ట్రైలర్, టీజర్లను కూడా తొలగిస్తున్నట్లు నిర్మాత లిఖితపూర్వకంగా హైకోర్టుకు నివేదించాడు. వీటిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ఈ వ్యాజ్యంలో తదుపరి విచారణ అవసరం లేదంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సినిమాపై ఇంకా ఏవైనా అభ్యంతరాలు ఉంటే సెన్సార్ బోర్డుతోనే తేల్చుకోవాలంటూ రాధకి న్యాయమూర్తి సూచించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vangaveeti  Controversial song and scenes  High Court  remove  

Other Articles