వాళ్లిద్దరి ఇల్లీగల్ అఫైర్ కి గ్రీన్ సిగ్నల్ | Shraddha-Farhan Akhtar link-up opned.

Shraddha farhan akhtar link up becomes official

Shraddha Kapoor, Farhan Akhtar, Shivangi Kapoor, Shakti Kapoor, Shraddha Kapoor-Farhan Akhtar relation

Shraddha Kapoor's mother is okay with Shraddha-Farhan Akhtar link-up.

స్టార్ డైరక్టర్ అఫైర్ అఫీషియల్ కాబోతుందా?

Posted: 11/28/2016 03:49 PM IST
Shraddha farhan akhtar link up becomes official

నటుడు ఫర్హాన్ ఖాన్ కాపురంలో శ్రద్ధాకపూర్ పెట్టిన చిచ్చు అఫీషియల్ గా మారబోతుందా? పైకి ఫ్రెండ్స్ అంటూనే వెనకాల వెనకాల వీరు చేసే వ్యవహారం అంతా ఇంతా కాదు. అసలు శ్రద్ధా కారణంగానే ఫర్హాన్‌ భార్య అధూనాకి విడాకులు ఇచ్చాడని చాలాకాలంలో బాలీవుడ్‌లో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇలాంటి రూమర్స్‌ బాధ కలిగిస్తాయని ఫర్హాన్‌ తనకి మంచి స్నేహితుడు మాత్రమేనని శ్రద్ధాకపూర్‌ పలుమార్లు మీడియా ద్వారా వెల్లడించింది.

కానీ, వీరిద్దరూ ప్రవర్తించే తీరుకి శ్రద్ధాకపూర్‌ చెప్పిన సమాధానానికి ఎక్కడా పొంతన లేదు. అప్పట్లో ఓ పార్టీలో శ్రద్ధ తల్లిదండ్రులు శక్తి, శివంగి కపూర్లు ఉన్నంత వరకు ఆమె తన పరిధుల్లో తానుంది. ఒక్కసారి పార్టీ నుంచి తల్లిదండ్రులు వెళ్లిపోగానే శ్రద్ధ.. ఫర్హాన్‌తో కలిసి అందరిముందే శృతిమించి చిందులు వేసినట్లు చెప్పుకున్నారు. అంతేకాదు ఇటీవల ముంబయిలో జరిగిన గ్లోబల్‌ సిటీజెన్‌ ఫెస్టివల్‌కి కూడా ఆమె ఫర్హాన్‌తో కలిసే వెళ్లింది. ఆపై వీలు దొరికినప్పుడల్లా శ్రద్ధ ఫర్హాన్‌ ఇంట్లోనే ఎక్కువగా ఉంటోంది.

అంతెందుకు ఫర్హాన్‌ నిర్మాతగా వ్యవహరించబోయే ఓ చిత్రంలో శ్రద్ధను ఎంపికచేసుకున్నాడని ఇలా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే, కూతురి అఫైర్ కి తల్లీ సపోర్ట్ ఇస్తోందన్న మరో వార్త చక్కర్లు కొడుతోంది. రీసెంట్ గా బాంద్రాలో ఫర్హాన్‌ ఓ కొత్త ఇల్లు కొనుక్కున్నాడు. ఆ ఇంట్లో శ్రద్ధ, ఫర్హాన్‌లు కలిసే ఉండబోతున్నారని, ఇటీవలె కూతురితోపాటు తల్లి కూడా ఆ ఇంటికి వెళ్లి కాసేపు గడిచి వచ్చిందని, సన్నిహితుల వద్ద కూడా వారి ప్రస్తావన తెచ్చిందని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shraddha Kapoor  Farhan Akhtar  relationship  Shivangi Kapoor  

Other Articles

Today on Telugu Wishesh