నైటీలు వేసుకునే ఆడాళ్లు అన్నీ అడ్డమైన పనులే అంటూ ఫైర్ | Actor Uttej Fire on Woman dressing.

Actor uttej frustrated on women clothing

Actor Uttej, Uttej interview, Uttej Fire on Woman Dressing, Uttej Nightwear, Uttej Nighties, Uttej 10TV interview

Actor Uttej Fire on Woman Dressing style.

మహిళల వస్త్రాధారణపై ఉత్తేజ్ కామెంట్లు

Posted: 11/25/2016 12:31 PM IST
Actor uttej frustrated on women clothing

ఇప్పుడున్న సమయంలో ఎవరి నోటి నుంచి ఎలాంటి వ్యాఖ్యలు వస్తాయో ఊహించటం చాలా కష్టంగా మారిపోయింది. తెరవెనక్కి వెళ్లిపోతున్నారు అనుకుంటున్న సమయంలో వారు చేసే కామెంట్లతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయి మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చేస్తున్నారు. యంగ్ జనరేషన్ హీరోలు, హీరోయిన్ల విషయంలో ఇది బాగా ఉన్నప్పటికీ, తెలుగులో ఓ సీనియర్ నటుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారమే రేపుతున్నాయి.

క్యారెక్టర్ ఆర్టిస్ట్, పలు సినిమాలకు రైటర్ గా కూడా పని చేసిన నటుడు ఉత్తేజ్ మహిళలపై చేసిన వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కుంటున్నాడు. తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హాజరైన ఉత్తేజ్ మాట్లాడుతూ... ‘కొంతమంది రాత్రిపూట ధరించే నైటీలతోనే మార్కెట్‌కి వచ్చేస్తారని, అదే నైటీతో స్కూటర్లపై కూడా డ్రైవ్ చేస్తున్నారని బయటకు వచ్చేది అలాగేనా అని ప్రశ్నించాడు. వీరు ఎప్పుడూ ఫోన్‌లో మాట్లాడుతూనే ఉంటారు కాని వారి పిల్లలు ఫోన్ పట్టుకోకూడదంటే ఇదెక్కడి న్యాయం అన్నాడు.

 

ప్రస్తుతం పిల్లలకు సరైన సోషల్ ఎడ్యుకేషన్ అందటం లేదని, అందువల్ల చుట్టూ ఉన్న రకరకాల ఎడ్యుకేషన్స్ చూసి నేర్చుకుంటున్నారని, పిల్లలకు నూటికి నూరు మార్కులు వచ్చినంత మాత్రాన ఏం ఉపయోగం ఉంటుందని వారికి సమాజం పట్ల అవగాహన చాలా అవసరం అని, ఇలా చెబితే నన్ను అందరూ విలన్‌లా చూస్తారని’ పేర్కొన్నారు. కుటుంబ వ్యవస్థలపైన, సమాజంపైన వ్యక్తిగత అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఉన్నప్పటికీ, మరీ మహిళలను అగౌరవపరుస్తూ ఇతంలా వ్యాఖ్యలు చేయటం సరికాదంటూ మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Uttej  woman Dressing style  Nightware  

Other Articles

Today on Telugu Wishesh