శివ.. శివా... ఏందిదీ? | Sofia Hayat flaunts her body again

Sofia hayat flaunts her body again

Sofia Hayat flaunts her body, Sofia Hayat Gym workouts, Nun Hot Gym workouts, Sofia Hayat siva treat, Sofia Hayat lord siva, Sofia Hayat instagram

Sofia Hayat flaunts her body again with Gym workouts with siva smaranam.

సన్యాసి అయినా సెక్సీ వేషాలు మానదా?

Posted: 11/04/2016 09:30 AM IST
Sofia hayat flaunts her body again

బాలీవుడ్ లో అప్పట్లో సోఫియా హయత్ అనే ఓ భామ ఉండేది. అదేనండీ మహేష్ బాబు నేనొక్కడినే చిత్రంలో లండన్ బాబూ అంటూ ఐటెం సాంగ్ లో చేసిందే ఆవిడగారు. బిగ్ బాస్ షోలో పాల్గొనటం ద్వారా దేశం మొత్తం ఆమె బాగా పాపులర్ అయ్యారు. ఆపై ఏం రోగం పుట్టిందో ఏమో తీర్థం పుచ్చుకుని సన్యాసిగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె గైయా సోఫియా మదర్. కానీ, పాత వాసనలు మాత్రం అస్సలు పోలేదు.

విదేశాల్లో ప్రశాంతమైన జీవితం గడుపుతుందేమోనన్న భ్రమలో ఉన్న అభిమానులను ఎప్పటికప్పుడూ హాట్ ఫోటోలతో ఆహ్లాదపరుస్తోంది. ఆ మధ్య యోగా గురువు బాబా రాందేవ్ ను సైతం టార్గెట్ చేసింది. నన్ గా మారాక కూడా బికినీ ఫోటోలు పెడుతుందని పలువురు మండిపడితే, ముందు రాందేవ్ బాబాను పొట్టి బట్టలు వేసుకుని పవిత్రమైన యోగాను చేయటం ఆపాలని చెప్పడంటూ భయంకరమైన క్లీవేజ్ డ్రెస్ తో ఓ మాంచి డెప్త్ ఉన్న సందేశం ఇచ్చింది. ఆపై మధ్య మధ్యలో బికినీ స్టంట్ లతో రెచ్చిపోయిన భంగిమలలో ఫోజులను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

Nun Sofia work outs

ఇక ఇప్పుడు ఏకంగా చిన్న డ్రాయర్, పైన టాప్ తో ఫోజులు ఇచ్చింది. అంతేకాదు తాను గాడ్ అని, శివుడికి జన్మనిచ్చింది తానేనని అందులో పేర్కొంది. ఉదయం పూట వర్కవుట్స్ చేసినందువల్లే సాధ్యమయిందట. 'శరీరమే దేవాలయం. నా శరీరంలో దైవత్వం ఉంది' అంటూ కొటేషన్స్ కూడా రాసి పెట్టింది. మనసును ప్రశాంతంగా ఉంచే మంత్రాలు వింటూ ఉంటుందట. ఇక చివర్లో అయితే.. మహాశివుడితో తనను సమానంగా తనే కీర్తించేసుకుంది సోఫియా.. 'ఓం నమశ్శివాయ.. నమస్తే సలామ్ గాయా మదర్ సోఫియా' అంటూ తన భజన తనే చేసుకుంది.

రీసెంట్ గా సోఫియా ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన హాట్ పిక్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. మరి సన్యాసిగా మారిపోయాక ఈ సవట వేషాలేంటి అంటారనే కోణంలో ఆలోచన చేసిన సోఫియా మదర్ దానికి కూడా దైవత్వం అద్దేసి తెలివిగా తప్పించుకుంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sofia Hayat  Instagram  Gym workouts  hot photos  

Other Articles