అప్పుడు చిరు... ఇప్పుడు చెర్రీ | man behind no audio function for dhruva

Man behind no audio function for dhruva

Sarrainodu formula for Dhruva, reason behind no audio for Dhruva, No audio for Dhruva, Dhruva pre release function, vijayawada or vizag for cherry dhruva, Dhruva audio release date

No Audio for Ram Charan's Dhruva movie. Producer Allu Aravind follows Sarrainodu formula.

ప్లాన్ మొత్తం ఆయన గారిదేనా?

Posted: 11/04/2016 08:05 AM IST
Man behind no audio function for dhruva

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కథానాయకుడిగా రూపొందుతోన్న 'ధ్రువ' సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో టైటిల్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఆ సాంగ్ లో ఫిట్ గా కనిపించేందుకు బాలీవుడ్ లో సల్మాన్ సుల్తాన్, అమీర్ దంగల్ చిత్రాలకు ట్రెయినర్ గా పని చేసిన రాకేష్ ఉదయర్ హెల్ఫ్ తీసుకున్నాడు చరణ్. ఈ సినిమాను డిసెంబర్ 2వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా చెప్పారు. దాంతో అభిమానులంతా ఆడియో రిలీజ్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా పాటలను ఈ నెల 9వ తేదీన ఆదిత్య మ్యూజిక్ ద్వారా నేరుగా మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు నిన్నంతా వార్తలు జోరుగా చక్కర్లు కొట్టాయి. అయితే ఆ వార్తను చెర్రీయే అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. కానీ, అభిమానులను నిరాశ చెందనీయకుడా సినిమా విడుదలకి ముందు, ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను జరపాలనే ఆలోచనలో దర్శకనిర్మాతలు వున్నట్టుగా తెలుస్తోంది. ధ్రువ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గతంలో సరైనోడు విషయంలో కూడా సేమ్ ఇదే ఫార్ములాను ఫాలో అయ్యాడు నిర్మాత అల్లు అరవింద్. ఇక ఇప్పుడు కూడా ఇదే స్ట్రాటజీని ధ్రువకు అన్వయిస్తున్నాడు.

ప్రీ రిలీజ్ పంక్షన్ ఐడియా అరవింద్ దే కాగా, చీఫ్ గెస్ట్ గా చిరు లేదా పవన్ కళ్యాణ్ ఆహ్వానించే ఆలోచనలో ఉన్న చెర్రీ తద్వారా సినిమా హైప్ ను ఇంకాస్త పెంచాలని చూస్తున్నాడు. గతంలో చిరు వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకున్న అరవింద్ ఇప్పుడు చెర్రీకి ఎలాగైనా గట్టి హిట్ అందించాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నాడు. తమిళ మాతృక 'తని ఒరువన్' భారీ విజయాన్ని సాధించడంతో, 'ధ్రువ' కూడా ఇక్కడ ఘనవిజయాన్ని అందుకోవడం ఖాయమనే నమ్మకంతో సినిమా యూనిట్ వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dhruva Movie  No Audio  Pre Release function  

Other Articles