రజనీయే అన్ని అయితే అక్షయ్ దేనికి? | Rajinikanth’s negative role in 2.0

Rajinikanth s triple role in 2 0

Rajanikanth triple role in 2.0, Rajani good and bad robots, Rajanikanth bad robot in Robo2.0, Rajanikanth triple role, Rajanikanth robo2.0, rajanikanth Enthiran 2

Superstar Rajinikanth’s triple role in 2.0, as good and bad robots.

తలైవా ట్రిపుల్ ధమకా

Posted: 11/03/2016 11:11 AM IST
Rajinikanth s triple role in 2 0

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు సక్సెస్, ఫెయిల్ అనేవి ఉండవు. రిజల్డ్ ఏదైనాసరే తదుపరి చిత్రం కోసం అంచనాలు పెరిగిపోతుంటాయి. కబాలి విషయంలోనూ అదే జరిగింది. బాక్సాఫీస్ వద్ద ఫలితం ఎలా ఉన్నా సరే... కబాలి క్రియేట్ చేసిన మ్యాజిక్ కొద్ది కాలంపాటు గుర్తుండిపోతుంది. ప్రస్తుతం రోబో-2.0 కూడా అదే అంచనాలను పెంచేస్తూ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఇక అప్ డేట్ల విషయానికొస్తే... ఇప్పటికే సినిమా 75 శాతంపైగా జరిగిపోయిందట. డిసెంబర్ కల్లా మొత్తం షూటింగ్ పూర్తి చేసి విజువల్ వర్క్స్ పైనే దృష్టి సారించాలని డైరక్టర్ శంకర్ ప్లాన్ లో ఉన్నాడు. ఇప్పటికే సినిమాలో ఒకే ఒక్క పాట ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారన్న వార్త బయటికి రాగా, ఇప్పుడు ఇందులో రజనీ ట్రిపుల్ రోల్ పోషిస్తున్నాడంటూ మరో న్యూస్ పొక్కింది. సైంటిస్ట్ తోపాటు రోబోగా రెండు రూపాలలో రజనీ దర్శనమివ్వబోతున్నాడంట. ఈ లెక్కన తలైవా ట్రిపుల్ ట్రీట్ కి సిద్ధం అవుతుండగా, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కేవలం బ్యాడ్ మాన్ గానే సినిమాలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది.

నవంబర్ 20న ముంబైలో జరిగే ఓ గ్రాండ్ ఈవెంట్ లో ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఎఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఈ చిత్రాన్ని 3డీ ఫార్మట్ లో రిలీజ్ చేసే ఆలోచన కూడా చేస్తోందట చిత్ర యూనిట్.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajanikanth  Robo 2.0  triple role  

Other Articles