కమెడియన్ సినిమా కోసం కోట్లు కుమ్మరించారు | Srinivas Reddy movie rights sold for record price.

Actror srinivas reddy movie sensation in tollywood

record price for Jayammu Nischayammura movie, Srinivas Reddy movie rights, Tollywood comedian srinivas reddy record in tollywood, Rights of Jayammu Nischayammura, Jayammu Nischayammura rights, Jayammu Nischayammura creates record

Rights of Jayammu Nischayammura sold for a record price.

రెడ్డిగారి సినిమా రిలీజ్ కు ముందే రికార్డు!

Posted: 10/29/2016 01:45 PM IST
Actror srinivas reddy movie sensation in tollywood

చిన్న సినిమాలు రిలీజ్ కు ముందు అంచనాలు ఏమాత్రం ఉండవు. కానీ, విడుదల అయ్యాకే వాటి ఫలితం నోళ్లు వెళ్లబెట్టేలా చూపిస్తుంది. ఈ యేడాది బిచ్చగాడు, పెళ్లి చూపులు టాలీవుడ్ కి అలాంటి అనుభవమే పంచాయి. అయితే రిలీజ్ కాకుండానే ఇప్పుడు ఒక స్మాల్ బడ్జెట్ సినిమా వండర్ క్రియేట్ చేసింది. రికార్డు స్థాయి శాటిలైట్స్ రేటుకు అమ్ముడుపోయి వార్తల్లో నిలిచింది.

పదిహేనేళ్ల క్రితమే కెరీర్ ప్రారంభించిన శ్రీనివాసరెడ్డికి గత కొంత కాలంగానే మంచి పాత్రలు, హిట్లు వచ్చిపడుతున్నాయి. సోలో, పటాస్, రేసుగుర్రం లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందగా, గీతాంజలిలో హీరో టైప్ క్యారెక్టర్ తో అలరించాడు. ఇక ఇప్పుడు కమెడియన్ శ్రీనివాస రెడ్డి పూర్తిస్థాయి హీరోగా, అవును ఫేం పూర్ణ హీరోయిన్ గా జయము నిశ్చయమ్మురా అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరక్టర్ల చేతుల మీదుగా ఫస్ట్ లుక్, ట్రైలర్ రిలీజ్ అయ్యాయి. అందులో కంటెంట్ కూడా చాలా ప్రామిసింగ్ గా ఉంది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఈ క్రమంలో ఎన్ కేఈఆర్ ఫిల్మ్స్ ఈ సినిమా రైట్స్ ను రికార్డు స్థాయిలో 7 కోట్లకు కొనుగోలు చేసింది. రీసెంట్ గా విక్రమ్ ఇంకొక్కడు హక్కులను ఈ సంస్థవారే కొన్నారు. మౌత్ టాక్ ద్వారా ఆ సినిమాకు బాగానే కలెక్షన్లు రావటంతో విపరీతంగా లాభాలు వచ్చాయి. దీంతో ఈ చిన్న సినిమాను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ రకంగా జయమ్ము నిశ్చయమ్మురా నిర్మాతలు జాక్ పాట్ కొట్టినట్లయ్యింది. అయితే సినిమాకు అదిరిపోయిందనే టాక్ వస్తేనే ఆ కలెక్షన్లు సాధ్యమవుతాయి. మరి రెడ్డిగారి సినిమా ఆ అంచనాలు అందుకుంటుందా చూద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Srinivas reddy  Jayammu Nischayammura  rights for record price  

Other Articles