షోలో మందు తాగించి మరీ... ప్రియాంకను అవమానించారా? | Did american hosts Ellen really insult Priyanka Chopra?

Priyanka chopra really insulted by american hosts

Priyanka Chopra insult, Priyanka Chopra American Hosts Ellen Insult, American Hosts Ellen Insult Indians, Hollywood show insult Priyanka, PC insult in Hollywood, PC in americal Show

Priyanka Chopra take it easy on American Hosts Ellen Insult.

ప్రియాంకే పిచ్చ లైట్ తీస్కుంది బాస్

Posted: 10/29/2016 11:15 AM IST
Priyanka chopra really insulted by american hosts

హాలీవుడ్ టీవీషోతో ఒక్కసారిగా పాపులర్ అయిన ఇండియన్ స్టార్ ప్రియాంక చోప్రాకు వరుసగా మూవీ ఆఫర్లు కూడా వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం రెడ్ కార్పెట్లు, ఫిల్మ్ ఫెస్టివల్స్ ఇలా ఎక్కడ చూసినా పిగ్గీ సందడే కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఓ టీవీ షోకి హాజరైన ప్రియాంక ఇచ్చిన ఇంటర్వ్యూపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి.

ప్రముఖ అమెరికన్ టీవీ వ్యాఖ్యాత ఎలెన్ బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాను అవమానించిందని ఆమె అభిమానులు మండిపడుతున్నారు. ప్రియాంకా చోప్రా, ఎలెన్ టాక్ షోకు హాజరైంది. ఈ షోలో ప్రియాంకా చోప్రాతో టకీలా తాగించింది. టీవీ షోలలో మద్యం తాగమని ఎవరూ చెప్పరని, కానీ ఆమె ప్రియాంకతో బలవంతంగా మద్యం తాగించిందని తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే షోలో ప్రియాంకా చోప్రా మిస్ వరల్డ్ గా ఎంపికైనప్పుడు చేసిన అభివాదం...'కరెంట్ బల్బు తీస్తున్నట్టు ఉందని' సెటైర్ వేసింది.

అలాగే టాక్ షో మధ్యలో 'మీరిప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయారు. మీ అందం, నటన ప్రేక్షకులకి నచ్చాయి' అని ఎలెన్ అనడంతో 'అలాంటిదేమీ' లేదని ప్రియాంక సమాధానం ఇచ్చిన వెంటనే 'నాకు తెలుసు, కానీ పొగడాలి కదా అని పొగిడాన'ని ఎలెన్ కాస్త కఠువగా చెప్పింది. దీంతో ప్రియాంక ఫ్యాన్స్ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎలెన్ పై విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. తనపై పడిన సెటైర్లు లైట్ గా తీస్కువటం ద్వారా స్పోర్టివ్ నెస్ చూపి మరో మెట్టు ఎక్కిందని, చాలా హుందాగా వ్యవహరించిందంటూ అక్కడి మీడియా రాస్తే, మన మీడియా ఫన్ పేరిట మన నటిని ఘోరంగా అవమానించారంటూ కథనాలు రాసేస్తుంది. ఎంత తేడానో చూడండి.

నిజానికి రియాల్టీ షోలలో ఇలాంటి వేషాలు మన దగ్గర కూడా ఉన్నాయి. అసలు మనం నేర్చుకుందే వారి దగ్గరి నుంచి అలాంటప్పుడు వాటిని ఎందుకు అంత సీరియస్ తీసుకుంటున్నారో అర్థం కావటం లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.  పైగా మాటలు పడ్డ ప్రియాంకే అవి పట్టించుకోనప్పుడు.. అభిమానులు అంత చేయటం అవసరమా అన్నదే ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Chopra  Ellen talkshow  Insult  

Other Articles