మహేష్ మూవీలో బాలయ్య లేడు.. మరీ ఎవరబ్బా? | Balayya not in Mahesh movie under Koratala direction

Koratala opens up on balayya mahesh multistarrer

Balayya-Mahesh Multistarrer, No Multistarrer with Balayya-Mahesh, Balayya not in Mahesh movie, Koratala Balayya mahesh, Mahesh Balayya

Koratala clears air on Balayya-Mahesh Multistarrer movie

ఆ బిగ్ మల్టీస్టారర్ నుంచి బాలయ్య అవుట్

Posted: 10/26/2016 03:40 PM IST
Koratala opens up on balayya mahesh multistarrer

గత రెండు రోజులుగా టాలీవుడ్ లో ఓ వార్త భయంకరంగా చక్కర్లు కొడుతోంది. మల్టీ స్టారర్ సినిమాలకు మళ్లీ ఆజ్యం పోసిన మహేష్ త్వరలో ఓ బిగ్ ప్రాజెక్టులో నటించబోతున్నాడని. ప్రస్తుతం మురగదాస్ చిత్రంలో చేస్తున్న మహేష్ తర్వాత సినిమా కొరటాల శివ దర్శకత్వంలోనే ఫిక్సయిపోయింది. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్న ఈ సినిమా గురించే ఓ సెన్సేషన్ వార్త హల్ చల్ చేసింది.

మనల్ని మనం ప్రేమించుకోవటం అనే కాన్సెప్ట్ కు సోషల్ టచ్ ఇస్తూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మహేష్ తోపాటు, టాలీవుడ్ అగ్ర నటుడు బాలకృష్ణ నటించబోతున్నాడని చెప్పుకున్నారు. వార్తలో ఎలాంటి కన్ఫర్మేషన్ లేకపోయినప్పటికీ, ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కి అనుగుణంగా బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటాడని, పైగా పరభాషా నటుడైన మోహన్ లాల్ ను ఒప్పించిన కొరటాలకు బాలయ్యను ఒప్పించడం పెద్ద సమస్యేమీ కాదని, పైగా సింహా సినిమాకు కథ, డైలాగులు రాసింది కొరటాలేనని అందరికీ తెలిసిన విషయమే గనుక బాలయ్య ఖచ్ఛితంగా ఒప్పుకుని తీరతాడని ఇలా ఓ బోల్డెన్నీ ఎగ్జాంపుల్స్ తో స్టోరీలు వచ్చాయి.

అయితే అదంతా ఉత్తదేనంటూ బాంబు పేల్చాడు దర్శకుడు కొరటాల. బాలయ్య తన నెక్స్ట్ ప్రాజెక్టులో లేడని తేల్చేయటమే కాదు.. తాను చెప్పేవరకు దయచేసి ఎలాంటి రూమర్లు లేపొద్దంటూ మీడియాకు విజ్నప్తి చేశాడు. అయితే బాలయ్య రోల్ లేదని చెప్పిన కొరటాల మల్టీస్టారర్ అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఆ లెక్కన సత్యరాజ్, జగపతిబాబు, మోహన్ లాల్ లెవల్లో మరో స్టార్ హీరో ఇందులో ఉండబోతున్నాడనే సంకేతాలు ఇచ్చాడన్న మాట. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allarinaresh kevvu keka
Kareena wedding date  
Rate This Article
(0 votes)
Tags : Koratala siva  Balayya  mahesh Babu  Multistarrer movie  

Other Articles