కేసీఆర్ ను రివర్స్ యాంగిల్ లో చూపిస్తాడంట | RGV announced movie on KCR

Rgv announced movie on kcr

RGV announced movie on KCR, RGV RCK, RGV Telangana Bruce lee KCR, KCR Movie trolls, KCR Biopic, Telanagana CM KCR Movie, RGV comments on KCR

RGV announced movie on KCR also announced title as RCK.

కేసీఆర్ పై ఆపుండ్రివయ్య మీ లొల్లి

Posted: 10/21/2016 03:57 PM IST
Rgv announced movie on kcr

మనిషి ఎవరైనా, వారి బ్యాగ్రౌండ్ ఏదైనా ఫర్వాలేదు. రాంగోపాల్ వర్మకు అవేం ఆనవు. ఎవరిమీదైనా సినిమా తీసి రచ్చ చేయాల్సిందే. పరిటాల రవి మొదలుకొని ఇప్పడు వంగవీటి వరకు, మాఫియా డాన్ దావూద్, లోకల్ గ్యాంగ్ స్టర్ నయీం ఇలా అందిరిపై సినిమాలు తీసేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఓ స్పెషల్ వ్యక్తికి సినిమా అంటూ గత రాత్రి ప్రకటించాడు. ఈపాటికే ఆ వార్త మీక్కూడా చేరి ఉండవచ్చు కూడా. ఆయనే తెలంగాణ సీఎం కేసీఆర్.

తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున్న లేపి దశాబ్దాల స్వరాష్ట్ర కలను సిద్ధింపజేసిన వ్యక్తి బయోపిక్ అంటే ఎవరికైనా ఆసక్తిరేకెత్తటం ఖాయం. కానీ, ఇక్కడ తీసేది వర్మ. మాములుగా తీయడు కదా. సినిమా పేరు 'ఆర్ సీ కే'. పేరుకే కాదు కేసీఆర్ కు పూర్తి రివర్స్ సినిమా ఉండబోతుందంట. మనకు కనిపించే కేసీఆర్  గురించి కాకుండా, లోపల ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపిస్తానని వర్మ ట్వీట్ చేశాడు. ఇదే సమయంలో కేసీఆర్ కు ఓ కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు. తెలంగాణ బ్రూస్ లీకి దీపికా పదుకొనే అందం కలిపితే కేసీఆర్ అని అన్నాడు.

'వంగవీటి' సినిమా అనౌన్స్ మెంట్ సమయంలో ఇదే తన చివరి సినిమా అని చెప్పిన వర్మ... ఇప్పుడు ఏకంగా కేసీఆర్ సినిమా తీస్తానంటూ సంచలనానికి తెరతీశాడు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వర్మపై అప్పుడే బూతు పురాణం మొదలైపోయింది కూడా. ఇక మధుర శ్రీధర్ కేసీఆర్ బయోపిక్ తీస్తానని ప్రకటించిన సాయంత్రానికే వర్మ ఈ ట్వీట్ చేయటం విశేషం. చూద్దాం. ఏది ముందు వస్తుందో? ఎవరు ఏం చూపిస్తారో? అప్పటిదాకా ఈ లొల్లి మాత్రం మనకు తప్పేలా లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RGV  KCR Movie  RCK movie  

Other Articles