సీక్రెట్ పెళ్లంటూ మెగా హీరోయిన్ పోస్ట్... డిలేట్ | Regina shocks with Marriage post.

Regina shocks with marriage post

regina marriage post, Regina Secret marriage that hero, Regina latest affair, Regina shocks Marriage post, Regina Marriage post, Regina Ring, Regina Engaged

Regina Cassandra post message with marriage, and deleted later.

ఆ హీరోయిన్ అఫైర్ ఇప్పుడు ఎవరితోనో?

Posted: 10/20/2016 11:14 AM IST
Regina shocks with marriage post

హిట్లు లేకపోయినా అవకాశాలు తక్కువగా లేకుండా తెగ బిజీగా గడిపేస్తుంది డస్కీ బ్యూటీ రెజీనా కసాండ్రా. ఈ మధ్య జ్యో అచ్యుతానంద మాత్రమే ఆమెకు కాస్త సంతోషాన్ని మిగిల్చింది. అయితే అందులో ఆమె పాత్ర పెద్దగా పేలలేదనే చెప్పాలి. మరి అలాంటి సమయంలో బాలీవుడ్ లో అది కూడా బిగ్ బీ సినిమాలో రావటం ఎవరూ ఊహించలేకపోయారు. సినిమాకు కాస్త టైం ఉండటంతో సౌత్ లో ప్రాజెక్టులను త్వరగతిన పూర్తి చేసే ప్రయత్నంలో ఉంది.

కెరీర్ ప్రారంభించి 11 ఏళ్లు అవుతున్నప్పటికీ ఆమెకు రేంజ్ హిట్ మాత్రం లేదు. కానీ, గాసిప్స్ విషయంలో మాత్రం ఎప్పుడూ ముందుంటుంది. కెరీర్ ప్రారంభంలో కొత్త హీరోతో చెట్టాపట్టాలేసుకుని తిరుగిందని, ఆపై యువహీరో సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్ ఇలా చాలా మందితో వ్యవహారం నడిపినట్లు గాసిప్స్ వచ్చాయి. కానీ, వాటిని ఏనాడూ ఖండించకుండా, తన లైఫ్ తన ఇష్టం అన్న చందాన వ్యాఖ్యలు చేసింది.

బుధవారం ఆమె చేసిన ఓ పోస్ట్ పెద్ద డిస్కషన్ గా మారిపోయింది. ''సారీ. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. నేను ఇతడిని పెళ్లిచేసుకున్నాను. అతనెవరో మీ అందరికీ చెప్పేయాలని ఉంది. కాని చెప్పలేను. త్వరలో మీకే తెలుస్తుంది'' అంటూ తన చేతిని ఒక అబ్బాయి చేతిలో ఉంచి.. ఆ చేతికి ఉన్న ఉంగరం చూపించింది. ఆపై ఏం జరిగిందో తెలీదు కాసేపటికే ఆ పోస్టును తీసేసింది. చూస్తుంటే ఇదంతా ఏదో సినిమా కోసం చేస్తున్న ప్రమోషనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. లేక గతంలో లస్సీ కోసం గర్భవతి అని డ్రామా ఆడినట్లు స్టోరీ అల్లుతుందా?. ఈ మధ్య కాలంలో కానీ పెళ్లిళ్లనే అయినట్లు చూపించే మీడియా సీక్రెట్ పెళ్లి అయితే హైలెట్ చేయకుండా ఉంటుందా? చెప్పండి.

Regina secret marriage

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : regina Cassandra  Secret Marriage  Instagram Post  

Other Articles