కాళ్ల బేరానికి వచ్చినా కనికరం చూపించరా? | Karan Johar’s statement on Ae Dil Hai Mushkil controversary

Karan johar s statement on ae dil hai mushkil controversary

karan request for Ae Dil Hai Mushkil release, Ae Dil Hai Mushkil karan video, karan johar request video, Karan Johar to MNS, karan johar please for movie release, ranbir kapoor request

Karan Johar’s statement on Ae Dil Hai Mushkil controversary.

కరణ్ ని కనికరించే ప్రసక్తే లేదు

Posted: 10/19/2016 08:50 AM IST
Karan johar s statement on ae dil hai mushkil controversary

పాకిస్థాన్ నటుల వివాదం ముదరడంతో ప్రముఖులను రంగంలోకి దింపి, వారి చేత పాక్ నటులకు మద్దతుగా మాట్లాడించి, వారికి అనుకూల ప్రకటనలు చేయించాడు దర్శకుడు కరణ్ జోహర్. సల్మాన్, ఓం పురి, ప్రియాంకా చోప్రా వంటి నటులు కరణ్ కు అనుకూలంగా మాట్లాడినా.. రాజకీయ పార్టీలు దిగి రాలేదు. దీంతో సినిమా థియేటర్లకు చేరేది అనుమానంగానే మారుతోంది. రిలీజ్ డేట్ దగ్గరికి వస్తోంది. దీంతో ప్రముఖ నిర్మాత కరణ్ జొహార్ తెలివిగా కాళ్ల బేరానికి దిగాడు.

తానే స్వయంగా ఓ వీడియో విడుదల చేశాడు. ఈ వీడియోలో, ఉగ్రవాదాన్ని ఖండిస్తానని, మన సైన్యాన్ని గౌరవిస్తానని, తాను కూడా దేశభక్తుడినేనని పేర్కొన్నాడు. 'గత 2 వారాలుగా దీనిపై ఏమీ మాట్లాడని తాను.... కొంతమంది వ్యక్తులు తనని దేశ ద్రోహిగా ముద్రిస్తుండటం వలన నాకు చాలా బాధ కలిగింది. అందుకే ఇప్పుడు మాట్లాడాల్సి వస్తోంది'' అని ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు. "నాకు నా దేశం కన్నా ఇంకేదీ ముఖ్యం కాదు. నేనెప్పుడు నా దేశభక్తిని ప్రేమ మార్గంలో నా సినిమాలతోనే చాటిచెప్పాలని భావించాను" అని తెలిపాడు కరణ్.

"గతేడాది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ సినిమాని షూట్ చేసిన సమయంలో అప్పటి పరిస్థితి పూర్తి భిన్నంగా వుంది. పాక్‌తో సన్నిహత సంబంధాలు కలిగి వుండేందుకు అప్పుడు భారత్ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. నేను ఆ ప్రయత్నాన్ని గౌరవించాను. అలాగే ఇప్పుడున్న పరిస్థితులని కూడా నేను అర్థం చేసుకోగలను. అందుకే ఇప్పుడు చెబుతోంది ఏంటంటే... ఇకపై పాక్ నటీనటులతో సినిమాలు చేయను. కానీ అదే సమయంలో మీ అందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నా ఈ సినిమా కోసం దాదాపు 300లకిపైగా భారతీయులు అహర్నిశలు కృషిచేశారు. ఎంతో చమటోడ్చి శ్రమించారు. ఇటువంటి పరిణామాల కారణంగా వాళ్లు ఇబ్బంది పడటం భావ్యం అని అనుకోను.

 

ఇండియన్ ఆర్మీని గౌరవిస్తాను. మనల్ని కాపాడటానికి వాళ్లు పడుతున్న శ్రమకిగాను వారికి మనస్పూర్తిగా వందనాలు చెబుతున్నాను. నా దేశ ప్రజలకు, నాకు ముప్పు కలిగించే ఉగ్రవాదం ఏదైనా నేను దానిని తీవ్రంగా ఖండిస్తాను. ముఖ్యంగా మేము కూడా అన్నింటికన్నా ఎక్కువగా దేశాన్ని గౌరవిస్తామనే వాస్తవాన్ని గుర్తించి ఇప్పుడు మేమున్న పరిస్థితిని అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని అభిప్రాయపడ్డాడు కరణ్.

అయితే ఈ వీడియోపై రాజకీయ సంఘాలతోపాటు సోషల్ మీడియాలో కూడా పెద్దగా ఆదరణ లభించడం లేదు. ముఖ్యంగా సినిమాను అడ్డుకోవాలని మొండిపట్టుతో ఉన్న ఎంఎన్ఎస్ లాంటి సంఘాలైతే ఆ క్షమాపణతో అస్సలు సంతృప్తి చెందటం లేదు. మరోవైపు రణ్ బీర్ కపూర్ కూడా తాను వరుస ఫ్లాపులలో ఉన్నానని, ఈ సినిమా తనకు చాలా అవసరమని కోరుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karan Johar  Request video  Ae Dil Hai Mushkil release  video  

Other Articles