సమంత ఫోటోకి పీవీ సింధు రెస్పాన్స్ | gutta jwala and PV sindhu replay to sam and chaitu pic

Gutta jwala and pv sindhu replay to sam and chaitu pic

PV sindhu samantha, samantha badminton pic, samantha shuttle with nagachaitanya, nagachaitanya samantha, sam naga chaitanya

gutta jwala and PV sindhu replay to sam and chaitu pic.

చై-శామ్ ఆటకు రెస్పాండ్ అయ్యింది ఎవరంటే...

Posted: 10/13/2016 03:08 PM IST
Gutta jwala and pv sindhu replay to sam and chaitu pic

ప్రేమలో ప్రతిక్షణాన్ని సినీ నటి సమంత నాగ చైతన్య ఎంజాయ్ చేస్తున్నారు. వివాహం పక్కా అని ప్రకటించిన తరువాత తొలిసారి సమంత సోషల్ మీడియాలో తమ ఇద్దరి ఫోటో ఒకటి షేర్ చేసింది. అంతే కాదు, ఆ ఫోటోలో నాగచైతన్య ఫోటోపై లూజర్ అని, తన ఫోటోపై విన్నర్ అని రాసుకుంది. అయితే ఈ ఫోటోలో లూజర్ ఠీవీగా నిల్చుని ఉండగా, విన్నర్ కిందపడిపోయి విజయానందం ఆస్వాదిస్తూ ఉండడం విశేషం. నాగచైతన్యతో కలిసి షటిల్‌ ఆడి నీరసించిపోయిన సమంత మ్యాచ్ లో తానే గెలిచానని తెలిపింది.

అంతేకాదు ‘బూ హ హ హ హ.. ఇలాంటి సమయంలో పీవీ సింధు మాకు స్ఫూర్తి’ అని ట్విట్టర్‌ లో పేర్కొంది. ఈ ట్వీట్‌ కు బ్యాడ్మింటన్‌ డబుల్స్ మహిళా క్రీడాకారిణి గుత్తా జ్వాలా వెంటనే స్పందించింది. ‘హ హ హ.. గెలిచినందుకు శుభాకాంక్షలు’ అని ట్వీట్‌ చేసింది. దానికి సమంత జవాబిస్తూ, ‘నేను చీట్‌ చేశాను’ అంటూ ఆటలో చైతన్య గెలిచినట్లు పరోక్షంగా వెల్లడించింది. ఎంతైనా సమంత మంచి ప్రియురాలని...తను చైని సరదాగా ఆటపట్టించిందని, ఇతరుల దగ్గర అతను గొప్ప అని చెప్పిందని నెటిజన్లు పేర్కొంటున్నారు.

ఇంత‌కుముందు చైతూ-స‌మంత క‌లిసి షాపింగ్ చేస్తున్న.. క‌లిసి సినిమా చూస్తున్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాయి. అయితే ఇంతకాలం కేవలం దాపరికంగా ఉన్న వీరి వ్యవహారం ఓపెన్ కావటంతో ఇక ఇలా పెట్టేసుకుంటున్నారు. అన్నట్లు చివర్లో పీవీ సింధు సైతం వీరి ట్వీట్ కు రిప్లై ఇవ్వటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantha  nagachaitanya  PVsindhu  Gutta Jwala  

Other Articles