దర్శక భాహుబలి రాజమౌళికి జన్మదిన శుభాకాంక్షలు.. SS Rajamouli, Rakul, Ali celebrate their birthdays today

Ss rajamouli rakul preet singh ali celebrate their birthdays on ayudh pooja

Director SS Rajamouli,Actress Rakul Preet Singh,comedy actor Ali,SS Rajamouli celebrate 43rd birthday,Rakul Preet celebrate birthday,actor Ali celebrate birthday,Ayudh Pooja day,Rakul Preet birthday wishes,SS Rajamouli birthday wishes,actor Ali birthday wishes

Director SS Rajamouli, actress Rakul Preet Singh and comedian Ali are celebrating their birthdays today. They have been flooded with wishes on social media.

దర్శక భాహుబలి రాజమౌళికి జన్మదిన శుభాకాంక్షలు..

Posted: 10/10/2016 04:55 PM IST
Ss rajamouli rakul preet singh ali celebrate their birthdays on ayudh pooja

దర్శక ధీరుడు, దర్శక బాహుబలి టాలీవుడ్ స్థాయిని అంతర్జాతీయ స్తాయికి తీసుకెళ్లిన అపజయం ఎరుగుని సినీ మాంత్రికుడు ఆయన. వరుస విజయాలతో దూసుకెళ్తూ.. తన టేకింగ్ లో చిన్న ఈగను కూడా పెద్ద హీరోగా చేసిన జక్కన గురించి తెలుగు ప్రజలకు చెప్పాల్సిన పనిలేదు. ఆయన మరోవరో కాదు.. ‘బాహుబలి’తో ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి. ప్రస్తుతం సినీ ప్రపంచం మొత్తం ఆయన తదుపరి దృశ్యకావ్యం 'బాహుబలి-2' కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ఇవాళ జన్మదినం జరుపుకుంటున్నారు.

ఆయన పుట్టినరోజు గురించి తెలియడంతో సినీ ప్రముఖుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్‌ ప్రముఖులు కరణ్‌ జోహర్‌, తరణ్‌ ఆదర్శ్‌, హీరో సునీల్‌, హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తదితరులు ట్విట్టర్‌లో రాజమౌళికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం రాజమౌళి 'బాహుబలి-2' షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న  ఈ సినిమా విడుదల కానుంది.

అయితే రిలీజ్ డేట్ ను ప్రకటించిన నేపథ్యంలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో.. దానిని ఈ సినీ మాంత్రికుడు ఎలా చూపిస్తాడో తెలుసుకోవాలన్న ఉత్కంఠ అభిమానులలో నెలకొంది. ఇక రాజమౌళితో పాటు ఇవాళ అందాల పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్, సహా కమేడియన్ అలి కూడా జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వీరికి కూడా అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లివిరిసాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  SS Rajamouli  Rakul Preet  Ali  birthday  tollywood  bollywood  

Other Articles