జేమ్స్ బాండ్ తో పాన్ కు అంతర్జాతీయ గుర్తింపు | Former James Bond Pierce Brosnan promotes pan masala

Former james bond pierce brosnan promotes pan masala

Former James Bond Pierce Brosnan promotes pan masala, Pierce Brosnan promotes pan masala, Trolls on Bond Pan Masala Ad, Bond Brand Ambassador for Bahar Pan Masala, Hollywood actor for Pan Masala, International Recognisation for Pan Masala

Former James Bond Pierce Brosnan promotes pan masala, Twitterati lose it.

పాన్ యాడ్ తో జేమ్స్ బాండ్ పై జోకులు

Posted: 10/07/2016 03:31 PM IST
Former james bond pierce brosnan promotes pan masala

శుక్రవారం ఉదయం దేశమంతా ఓ విచిత్రమైన ప్రకటనతో మేలుకొంది. ఉత్తరాదికి చెందిన జాతీయ మాగ్జైన్లు, ఇంటర్నెట్ లో కూడా ఓ పాన్ యాడ్ అందరి దృష్టిని ఆకర్షించింది.  ఎందుకంటే అందులో ఉంది హాలీవుడ్ స్టార్ పియర్స్ బ్రాన్సన్. జేమ్స్ బాండ్ క్యారెక్టర్ లో పాపులర్ అయిన ఈ నటదిగ్గజం ఓ పాన్ డబ్బా పట్టుకున్నట్లు ఆ యాడ్ లో ఉంది.

గడ్డంతో ఉన్న ఈ మాజీ బాండ్ చేతులో పాన్ బహర్ డబ్బా ఉంది. క్లాస్ నెవర్ గోస్ అవుట్ ఆఫ్ స్టైల్ అంటూ కాప్షన్ తో గన్ ప్లేస్ లో పాన్ డబ్బా పట్టుకున్న బ్రాన్సన్ ఫోటో నెట్ లో వైరల్ గా మారింది. చివర్లో అతని సంతకం కూడా కింద ఉండటం విశేషం. కాగా, ఈ ఫోటోపై సోషల్ మీడియాలో సెటైర్లు కూడా అదే రేంజ్ లో పడుతున్నాయి. బాండ్ ఓ పాన్ షాప్ కి వెళ్తాడు... అక్కడ పాన్ వేసుకున్నాక తుపుక్కున ఉమ్మి ఐయామ్ బాండ్ జేమ్స్ బాండ్ అంటాడు అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు. పాన్ తినండి గొప్పోలు అయిపోండి అంటూ సలహాలు ఇస్తున్నారు మరికొందరు.

గతంలో సైఫ్ అలీఖాన్ లాంటి బాలీవుడ్ స్టార్స్ ప్రమోట్ చేసిన ఈ బ్రాండ్కు ప్రస్తుతం ఈ హాలీవుడ్ స్టార్ అంబాసిడర్గా వ్యవహరించేందుకు అంగీకరించారు. బాండ్ ప్రచారం పాన్ మసాలాకు ఇంటర్నేషనల్ ఫేం తీసుకు వస్తుందేమో చూద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Former James Bond  Pierce Brosnan promotes  Bahar pan masala  

Other Articles